ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులు వెనుకబడ్డ బెన్ స్టోక్స్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో 425 పరుగుల భారీ స్కోరు చేసింది.
- రెండో టెస్టులోనూ ఓడిన విండీస్
ట్రెంట్‌బ్రిడ్జ్(నాటింగ్‌హామ్) : స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులు వెనుకబడ్డ బెన్ స్టోక్స్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో 425 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (122) టెస్టు కెరీర్లో 32వ సెంచరీ పూర్తిచేయగా యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ (109) ఐదో టెస్టు శతకం చేశాడు. డకెట్ (76), ఓలీ పోప్ (51) సైతం రాణించడంతో ఆ జట్టు విండీస్ ఎదుట ఆతిథ్య జట్టు 385 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారీ ఛేదనలో విండీస్ 36.1 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌట్ అయి 241 పరుగుల తేడాతో పరాభవం పాలైంది.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు (457) చేసిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయింది. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (47), లూయిస్ (17) తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించినా ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. షోయబ్ బషీర్ (5/41), క్రిస్ వోక్స్ (2/28), అట్కిన్సన్ (2/49) ధాటికి విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించిన విషయం విదితమే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

