FIFA World Cup | మెక్సికో అభిమానుల గోల భరించలేం.. మాకు భద్రత కల్పించండి..!
FIFA World Cup : మెక్సికో మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి జట్టు బస చేసిన హోటల్ సమీపంలో టపాసులు కాలుస్తూ.. వాహనాల హారన్ మోతలతో.. నానా రభసకు పాల్పడుతున్నారు. నాకౌట్ దశలో వీరు మరింత రెచ్చిపోయే అవకాశమున్నందున ఇంగ్లండ్ (England) జట్టు ముందు జాగ్రత్తగా కీలక నిర్ణయం తీసుకుంది.
FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో అభిమానుల హడావిడి మూమూల. కానీ, ఈసారి మెక్సికో(Mexico) ఫ్యాన్స్ రచ్చకు ఇతర జట్లు హడలిపోతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఆతిథ్య జట్టు మద్దతుదారులు ఇతర జట్ల ఆటగాళ్లకు నిద్రను దూరం చేస్తున్నారు. మెక్సికో మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి జట్టు బస చేసిన హోటల్ సమీపంలో టపాసులు కాలుస్తూ.. వాహనాల హారన్ మోతలతో.. నానా రభసకు పాల్పడుతున్నారు. నాకౌట్ దశలో వీరు మరింత రెచ్చిపోయే అవకాశమున్నందున ఇంగ్లండ్ (England) జట్టు ముందు జాగ్రత్తగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఈక్వెడార్ జట్టుకు కేటాయించిన హోటల్ సమీపంలో మెక్సికో అభిమానులు రాత్రంతా భారీ శబ్దాలు చేశారు. ప్రత్యర్థి ఆటగాళ్లకు నిద్ర లేకుండా చేశారు. దాంతో, తమకు ఈ పరిస్థితి ఎదురవ్వకుండా ఇంగ్లండ్ జట్టు జాగ్రత్త పడుతోంది. జూలై 5 ఆదివారం మెక్సికోతో 16వ రౌండ్ మ్యాచ్ ఉన్నందున.. ఫిఫా వరల్డ్‌కప్ నిర్వాహకులకు ఇంగ్లండ్ మేనేజర్ థామస్ తుచెల్, కెప్టెన్ హ్యారీ కనేలు విజ్ఞప్తి చేశారు.
Mexican fans brought drums, fireworks, and car horns outside Ecuador’s team hotel to keep the players from sleeping 🤣🇲🇽🎺
(Via @zaritzisosa, @ECZ23) pic.twitter.com/XsQQ1h0IN5
— Bleacher Report (@BleacherReport) June 30, 2026
మ్యాచ్ ముందుర రోజు(శనివారం) రాత్రి తమ ప్లేయర్లకు కంటినిండా నిద్ర ఉండడం కోసం హోటల్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో, మెక్సికో అభిమానులు ఇంగ్లండ్ జట్టున్న హోటల్ దగ్గరకు రాకుండా.. సమీపంలో రోడ్లను బ్లాక్ చేయడం వంటి చర్యలు తీసుకోనుంది ఫిఫా.
2,240 మీటర్ల ఎత్తులో..
16వ రౌండ్‌కు దూసుకెళ్లిన ఇంగ్లండ్, మెక్సికో మ్యాచ్ ఆదివారం ది ఎస్తాడియో అజ్టెకా మైదానంలో తలపడనున్నాయి. సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తుండే ఈ స్టేడియంలో కొద్దిపాటి గాలి కూడా బంతి గమనాన్ని మార్చేస్తుంది. సో.. మ్యాచ్ సన్నద్ధత కోసం ఇంగ్లండ్ రెండు రోజుల ముందుగానే మెక్సికో చేరుకుంది.
🤯🏴 BREAKING: England is taking precautions ahead of their World Cup match against Mexico.
Thomas Tuchel has decided to delay the team’s arrival to Mexico City over SPYING CONCERNS.
The English FA is also aware that the team hotel could be targeted by Mexican fans in an… pic.twitter.com/lkbsYXWp9N
— All Fútbol MX 🇲🇽 (@AllFutbolMX) July 2, 2026
16వ రౌండ్లో గెలిచిన జట్టుకు క్వార్టర్ ఫైనల్ బెర్తు దక్కుతుంది. సో.. మెక్సికో అభిమానుల గోల నుంచి తమను కాపాడాలని తద్వారా శనివారం తమ ఆటగాళ్లకు కంటినిండా నిద్ర ఉండేలా ఇంగ్లండ్ మేనేజర్ ఫిఫా యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

