ENG vs PAK | 22 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్
2000 డిసెంబర్లో ఇంగ్లండ్ పాక్ మీద మొదటి టెస్ట్ విజయం నమోదు చేసింది
ENG vs PAK : రావల్పిండిలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లండ్ 74 పరుగులతో గెలిచింది. 17 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ తొలి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. ఈ విజయంతో 22 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డ మీద టెస్ట్ మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించింది. 2000 డిసెంబర్లో ఇంగ్లండ్ పాక్ మీద మొదటి టెస్ట్ విజయం నమోదు చేసింది. మొత్తంగా చూస్తే ఆ జట్టుకు పాక్‌పై ఇది మూడో టెస్ట్ విజయం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మొదటి సెషన్లో వికెట్ కోల్పోకుండా 179 రన్స్ చేసింది. దాంతో తొలి సెషన్లో ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాదు మొదటి రోజు 506 పరుగుల చేసి ఒకేరోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా మరో రికార్డు సాధించింది.
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 657, రెండో ఇన్నింగ్స్‌లో 264 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ (73), హ్యారీ బ్రూక్ (87) అర్థ సెంచరీలతో రాణించడంతో పాక్‌కు 343పరుగుల టార్గెట్ విధించింది. ఒకదశలో 259 పరుగులకు 5 వికెట్లతో పాక్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. అయితే.. ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకోవడంతో 9 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయింది. ఓలి రాబిన్సన్, జేమ్స్ అండర్సన్ నాలుగేసి వికెట్లతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదటి టెస్టు విజయంతో ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్ట్ డిసెంబర్ 9 వ తేదీన జరగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

