Steven Finn | ఇంగ్లండ్‌కు మరో షాక్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ బౌలర్
Steven Finn : మాజీ చాంపియన్ ఇంగ్లండ్(England) జట్టుకు మరో షాక్. విధ్వంసక ఓపెనర్ అలెక్స్ హేల్స్(Alex Hales) వీడ్కోలు విషయం మరవకముందే మరో క్రికెటర్ ఆటకు గుడ్ బై చెప్పేశాడు. అవును ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్(Steven Finn) ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికాడు. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో..,
Steven Finn : మాజీ చాంపియన్ ఇంగ్లండ్(England) జట్టుకు మరో షాక్. విధ్వంసక ఓపెనర్ అలెక్స్ హేల్స్(Alex Hales) వీడ్కోలు విషయం మరవకముందే మరో క్రికెటర్ ఆటకు గుడ్ బై చెప్పేశాడు. అవును ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్(Steven Finn) ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికాడు. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నానని, అందుకనే ఆట నుంచి తప్పుకుంటున్నానని ఫిన్ తన వీడ్కోలు ప్రకటనలో తెలిపాడు.
‘గత 12 నెలలుగా నా శరీరంతో పోరాడుతున్నా. చివరకు అలసిపోయానని ఒప్పుకుంటున్నా. ఇన్నిరోజులు క్రికెట్ ఆడినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. 2005లో అరంగేట్రం చేశాను. అయితే… ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. అయినా కూడా వాటన్నింటినీ ఇష్టంగానే స్వీకరించా. ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 125 గేమ్‌లు ఆడాను. ఇంతకంటే ఎక్కువ ఇంకేం కోరుకోను’ అని ఫిన్ వెల్లడించాడు.
భారత జట్టుపై 2012లో ఐదు వికెట్లు తీసిన ఫిన్

కుడి చేతివాటం బౌలర్ అయిన ఫిన్ కౌంటీల్లో మిడిల్సెక్స్ జట్టుకు ఆడాడు. ఫస్ట్ క్లాస్‌లో అద్భుతంగా రాణించిన ఈ పొడగరి బౌలర్ జాతీయ జట్టులోకి వచ్చాడు. కచ్చితత్వంతో పాటు అదనపు బౌన్స్ రాబట్టగల ఫిన్‌ను అప్పట్లో ఆసీస్ లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్(Glenn Mcgrath)తో పోల్చేవారు. భారత జట్టుపై 2012లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఇంగ్లండ్ తరఫున 36 టెస్టులు, 69 వన్డేలు, 21 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 30.40 సగటుతో 125 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ ప్రదర్శన 6/125. వన్డేల్లోనూ అదరగొట్టిన ఫిన్ 102 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
Rahul Dravid | ఔను.. కొన్నాళ్లుగా భారత జట్టును వేధిస్తున్న సమస్య అదే : ద్రవిడ్
Yuzvendra Chahal | టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత బౌలర్ చాహల్ పేరిట చెత్త రికార్డు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

