మూడో వన్డేలో పట్టుదలగా ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు 8వ వికెట్ కోల్పోయింది. 44వ ఓవర్లో చాహల్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ విల్లే (18) పెవిలియన్ చేరాడు. విల్లే కొట్టిన బంతి నేరుగా లాంగాఫ్‌లో ఉన్న సూర్యకుమార్ వైపు వెళ్లింది. దాన్ని అతను చక్కగా అందుకోవడంతో విల్లే మైదానం వీడాడు.
అంతకుముందు బట్లర్ (60), లివింగ్‌స్టోన్ (27) ఇద్దరూ అవుటవడంతో.. విల్లే, ఓవర్టాన్ (25 నాటౌట్) ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే చాహల్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
Chahal strikes!
David Willey goes for the big shot, finds SKY in the deep.
Live – https://t.co/radUqNrOn1 #ENGvIND pic.twitter.com/g0GFV3iA63
— BCCI (@BCCI) July 17, 2022