T20 WorldCup | ఈ నలుగురు ఆటగాళ్లు రికార్డులు బద్దలు కొడతారా?
T20 WorldCup | ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు మొట్టమొదటి సారి ఒక టీ20 మ్యాచ్‌లో తలపడుతున్నాయి. అదే సమయంలో ఈ రెండు జట్లకు చెందిన నలుగురు ఆటగాళ్లు తమ తమ కెరీర్లలో రికార్డులు

దుబాయ్: ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు మొట్టమొదటి సారి ఒక టీ20 మ్యాచ్‌లో తలపడుతున్నాయి. అదే సమయంలో ఈ రెండు జట్లకు చెందిన నలుగురు ఆటగాళ్లు తమ తమ కెరీర్లలో రికార్డులు సృష్టించడానికి ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నారు. వీరిలో కొందరు మంచి ఫామ్‌లో ఉంటే, మరికొందరు ఫామ్ లేక తంటాలు పడుతున్నారు. మరి ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఈ ఆటగాళ్లు ఈ రికార్డులు బద్దలు కొడతారా? అంటే చెప్పలేం. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు? ఆ రికార్డులేంటో చూద్దామా..
జానీ బెయిర్‌స్టో

ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో ఎంతటి విధ్వంసకర బ్యాట్స్‌మెనో తెలిసిందే. కానీ ప్రస్తుతం అతను పెద్దగా ఫామ్‌లో లేక అవస్థలు పడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కనుక బెయిర్‌స్టో ఫామ్‌లోకి వస్తే అతను తన కెరీర్లో అద్భుతమైన రికార్డు సాధించే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ 58 టీ20 మ్యాచులు ఆడిన బెయిర్‌స్టో.. 1152 పరుగులు చేశాడు. వీటిలో 47 సిక్సర్లు, 108 ఫోర్లు ఉన్నాయి. బంగ్లాపై ఈ మ్యాచ్ విన్నర్ మూడంటే మూడు సిక్సర్లు బాదాడంటే టీ20 క్రికెట్లో 50 సిక్సర్లు కొట్టిన మైలురాయిని చేరుకుంటాడు.
లియామ్ లివింగ్స్టన్

విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన ఈ ఇంగ్లిష్ క్రికెటర్‌కు అనుభవం తక్కువే. ఎందుకంటే ఇప్పటి వరకూ అతను ఆడిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు తొమ్మిదే. అయితే ప్రపంచ వ్యాప్తంగా పలు టీ20 టోర్నీల్లో ఆడిన అతను వీటన్నింటిలో కలిపి ఇప్పటి వరకూ 3993 పరుగులు చేశాడు. అంటే ఇంకో 7 పరుగులు చేస్తే తన టీ20 కెరీర్లో 4వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడన్నమాట.
షకీబల్ హసన్

బంగ్లాదేశ్ జట్టులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో షకీబల్ హసన్ ఒకడు. వార్మప్ మ్యాచుల్లో బంతితో అద్భుతంగా రాణించాడు. తొలి మ్యాచ్‌లో కూడా ఆకట్టుకున్నాడు. షకీబల్ హసన్ మరో రెండు వికెట్లు తీశాడంటే టీ20 క్రికెట్లో 400 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇప్పటి వరకూ 92 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన అతను 117 వికెట్లు తీశాడు. వివిధ దేశాలో జరిగే క్రికెట్ టోర్నీలు, లీగులు కూడా కలుపుకుంటే అతని టీ20 కెరీర్లో 398 వికెట్లు ఉన్నాయి. అంటే మరో రెండు వికెట్లు తీశాడంటే డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్, ఇమ్రాన్ తాహిర్ సరసన చేరతాడు.
ముష్ఫికర్ రహీమ్

అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్న మరో బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ రహీమ్. ఈ వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ తన జట్టుకు చాలా సేవ చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్థశతకంతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతను మంచి స్కోరు సాధిస్తాడని జట్టు భావిస్తోంది. అతను టీ20 కెరీర్లో 1500 పరుగుల మైలురాయి చేరుకోవడానికి కేవలం 73 పరుగుల దూరంలో ఉన్నాడు. అతను కనుక ఈ ఫీట్ సాధిస్తే ఈ మైలురాయిని చేరుకున్న నాలుగో బంగ్లాదేశ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ ప్లేయర్లలో ఎవరు రికార్డులు సృష్టిస్తారు? ఎవరు వచ్చే మ్యాచ్ వరకూ మళ్లీ ఎదురు చూడాల్సి వస్తుంది? అనే విషయం మరికొద్దిసేపట్లో తెలిసిపోతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

