అబుధాబి: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను ఇంగ్లండ్ స్పిన్నర్ మొయీన్ అలీ దెబ్బకొట్టాడు. మ్యాచ్ ప్రారంభం కాగానే ఇంగ్లండ్ సారధి ఇయాన్ మోర్గాన్ బంతిని మొయీన్ అలీకి ఇచ్చాడు. అతను వేసిన తొలి ఓవర్ చివరి రెండు బంతులకు లిటాన్ దాస్ (9) బౌండరీలు బాదాడు.
మూడో ఓవర్లో మరోసారి బంతి అందుకున్న అలీ తన రెండో బంతికే లిటాన్ దాస్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి బంతికే మరో ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ (5)ను కూడా అవుట్ చేశాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసేసరికి 15/2తో బంగ్లా జట్టు కష్టాల్లో పడింది. వీరిని ఆరో ఓవర్లో క్రిస్ వోక్స్ మరో దెబ్బకొట్టాడు.
షకీబల్ హసన్ (4)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో తొలి పవర్‌ప్లే ముగిసేసరికి 6 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లా జట్టు 27 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫికర్ రహీమ్ (9 నాటౌట్), మహ్మదుల్లా ఉన్నారు.