Eng vs Ban | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఈ మ్యాచ్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
Eng vs Ban | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం నాడు బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. అబుధాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం నాడు బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. అబుధాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా టాస్ గెలిచాడు. బ్యాటింగ్ చేయడానికి పిచ్ సహకరించేలా కనిపిస్తోందని, అందుకే తాము ముందుగా బ్యాటింగ్ చేసి మంచి టార్గెట్ ఇవ్వాలని అనుకుంటున్నామని మహ్మదుల్లా చెప్పాడు.
అయితే ఈ మ్యాచ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు ఒక్కటంటే ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. రెండు దశాబ్దాలుగా ఈ రెండు జట్లు టెస్టు, వన్డే ఫార్మాట్లలో పోటీ పడుతున్నాయి.
కానీ ఒక్కటంటే ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడే అవకాశం వీటికి రాలేదు. ఐసీసీ టోర్నీల్లో కూడా ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు తలపడింది లేదు. మరి క్రికెట్ చరిత్రలో తొలిసారి ఈ రెండు జట్లు తలపడే ఈ మ్యాచ్‌లో విజేతగా ఎవరు నిలుస్తారో మరి.
బంగ్లాపై ఇంగ్లండ్ ఇప్పటి వరకూ ఆడిన మ్యాచులు ఇవే..

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

