ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు నిదానంగా లక్ష్యం వైపు సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్ జట్టు 112 పరుగులకే చాపచుట్టేసింది. ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌కు ఆశించినంత అద్భుతమైన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ జోస్ బట్లర్ (18) పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత 9వ ఓవర్లో మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ (19) కూడా పెవిలియన్ చేరాడు.
అయితే ఆఫ్ఘన్ బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పరుగులు కట్టడి చేశారు కానీ.. వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. దీంతో ఇంగ్లండ్ జట్టు లక్ష్యం దిశగా సాగుతోంది. 10 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు కేవలం రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులతో నిలిచింది. ఇంగ్లండ్ విజయానికి 60 బంతుల్లో 51 పరుగులు చేస్తే సరిపోతుంది.