పొట్టి ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా టైటిల్ ఫేవరెట్ ఇంగ్లండ్‌తో పోరాడేందుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఛేజ్ చేయడానికి ఇష్టపడుతుందని ఆ జట్టు సారధి జోస్ బట్లర్ చెప్పాడు.
ఇంగ్లండ్ జట్టులో అదనంగా ఒక బ్యాటర్‌ను తీసుకోవడానికే మొగ్గు చూపడంతో జోర్డాన్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు. తాము ముందుగా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నామని ఆఫ్ఘన్ సారధి మహమ్మద్ నబీ అన్నాడు. భారీ స్కోరు నమోదు చేసి ఇంగ్లండ్ జట్టును ఒత్తిడిలో పడేయాలనేదే తమ ప్లాన్ అని చెప్పాడు.
ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయీన్ అలీ, శామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, మార్క్ వుడ్
ఆఫ్ఘనిస్తాన్ జట్టు: హజ్రతుల్లా జజాయ్, రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, ఉస్మాన్ ఘనీ, నజిబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫరీద్ అహ్మద్, ఫజల్లాక్ ఫరూకీ