ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (10), హజ్రతుల్లా జజాయ్ (7) ఇద్దరూ నిరాశ పరిచారు. ఆ తర్వాత నిలకడగా ఆడుతున్న ఇబ్రహీం జద్రాన్ (32)ను కర్రాన్ బుట్టలో వేసుకున్నాడు.
కాసేపటికే నజిబుల్లా జద్రాన్ (13), మహమ్మద్ నబీ (3) కూడా పెవిలియన్ చేరారు. ఉస్మాన్ ఘనీ (23 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ అతనికి సహకారం అందిస్తున్నాడు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ జట్టు 16 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.