అనంతపూర్: దులీప్ ట్రోఫీ చివరి దశ మ్యాచ్లలో భాగంగా గురువారం మొదలైన ఇండియా ‘ఏ’ వర్సెస్ ఇండియా ‘సీ’ మ్యాచ్లో.. ‘ఏ’ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ శశావత్ రావత్ సెంచరీ (122 బ్యాటింగ్)తో మెరిశాడు. అతడికి అండగా ములానీ (44) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ‘ఏ’ 224/7 పరుగులు స్కోరు చేసింది. ఇండియా ‘బీ’ వర్సెస్ ‘డీ’ మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న ‘డీ’ జట్టు.. 77 ఓవర్లలో 306/5 పరుగులు చేసిం ది. సంజూ శాంసన్ (89 బ్యాటింగ్) శతకం దిశగా సాగుతుండగా పడిక్కల్ (50), కేఎస్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ధసెంచరీలు చేశారు.