న్యూయార్క్: ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌కు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో చుక్కెదురైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పోలాండ్ ప్లేయర్ సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6-3, 3-6, 1-6తో 20వ సీడ్ జెలెనా ఓస్టపెంకొ చేతిలో పరాజయం పాలైంది. తొలి సెట్లో అలవోకగా నెగ్గిన స్వియాటెక్.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో కోకో గాఫ్ 6-3, 3-6, 6-1తో వొజ్నియాకిపై, ముచోవా 6-3, 5-7, 6-1తో వాంగ్‌పై, క్రిస్టియా 6-3, 6-3తో బెన్కిక్పై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.
జొకో అలవోకగా..
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ 6-2, 7-5, 6-4తో గోజోపై గెలిచి ముందంజ వేశాడు. ఫ్రిట్జ్ 7-6 (7/2), 6-4, 6-4తో స్ట్రికర్పై, షెల్టన్ 6-4, 6-3, 4-6, 6-4తో పాల్‌పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు.
క్వార్టర్స్‌లో బోపన్న జంట
భారత వెటరన్ ప్లేయర్ రోహాన్ బోపన్న యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ ఎబ్డెన్తో కలిసి బరిలోకి దిగిన బోపన్న వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో బోపన్న-ఎబ్డెన్ జోడీ 6-4, 6-7 (5/7), 7-6 (10/6)తో కాష్-పాటెన్ (ఇంగ్లండ్) ద్వయంపై విజయం సాధించింది. ఈ ఏడాది వింబుల్డన్‌లోనూ సెమీఫైనల్ చేరిన ఈ జంట.. తాజా పోరులో 13 ఏస్‌లతో ఆకట్టుకుంది.