Ryan ten Doeschate : వరసగా రెండు టీ20 సిరీస్‌లు కోల్పోయిన భారత జట్టుకు మరో షాక్. సహాయక కోచ్ రియాన్ టెన్ డస్చేట్(Ryan ten Doeschate) తన బాధ్యతల నుంచి వైదొలగనున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఒక కొనసాగవద్దనే నిర్ణయానికి వచ్చాడని సమాచారం. ఇదే విషయాన్ని డస్చేట్ ప్రధాన కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐకు అతడు తెలియజేశాడు. ఒకవేళ గౌతీ, భారత బోర్డు ఆమోద ముద్ర వేస్తే ఇంగ్లండ్ పర్యటనతోనే టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా డస్చేట్ పదవీకాలం ముగియనుంది.
టీ20ల్లో ఊహించని విధంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో టీమిండియా వైట్‌వాష్‌కు గురయ్యాక.. ఆటగాళ్లపైనే కాదు కోచింగ్ సిబ్బందిపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో తొలి వన్డే జరుగుతుండగానే అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్చేట్ రాజీనామా వార్త వెలుగులోకి వచ్చింది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. తనను సహాయక కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని అతడు హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐని కోరాడు.
BREAKING 🚨
The England ODI series could be Ryan ten Doeschate’s final stint as part of the India coaching setup.#ENGvIND pic.twitter.com/vG5MjSRp7t
— Cricbuzz (@cricbuzz) July 14, 2026
డస్చేట్ కుటుంబం లండన్‌లో నివసిస్తోంది. అతడికి ముగ్గురు పిల్లలు. ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకోవడం అతడి భార్యకు కష్టంగా మారింది. దాంతో, పిల్లలలతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో డస్చేట్ కోచింగ్ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. టీమిండియా మ్యాచ్‌ల కోసం.. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో.. ఇకపై లండన్‌లోనే ఉంటూ కోచింగ్ కెరీర్ కొనసాగించాలని అనుకుంటున్నాడు. పైగా బీసీసీఐతో అతడి కాంట్రాక్టు కూడా ముగిసింది.
🚨 REPORTS 🚨
The England ODI series could be Ryan ten Doeschate’s final stint as part of the Indian coaching setup! 🇮🇳🏏
He has already informed the BCCI that he wants to move on and has requested to be relieved due to personal reasons. 🗣️
(Source: Cricbuzz)#ENGvIND #ODIs… pic.twitter.com/06RCrCMXsG
— Sportskeeda (@Sportskeeda) July 14, 2026
అయితే.. అటు గౌతీగానీ, ఇటు భారత బోర్డుగానీ డస్చేట్ గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ.. డస్చేట్ కోరినట్టే వెళ్లేందుకు అంగీకరిస్తే.. ఇంగ్లండ్‌తో మూడుల వన్డే సిరీస్‌తో భారత అసిస్టెంట్ కోచ్‌గా అతడి ప్రస్థానం ముగియనుంది. నెదర్లాండ్స్ మాజీ ఆటగాడైన డస్చేట్ రెండేళ్ల క్రితం భారత జట్టు సహాయక కోచ్‌గా చేరాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ సిబ్బందిలో ఒకటైన అతడిని గౌతం గంభీర్ తన బృందలో చేర్చుకున్నాడు.