Wimbledon : వింబుల్డన్‌లో నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) జోరు చూపిస్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో అతడు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం హోరాహోరీగా జరిగిన ప్రీ-క్వార్టర్స్ పోరులో రోమన్ సఫీల్లిన్(రష్యా)ను చిత్తు చేశాడు. ఈ విక్టరీతో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(Roger Federer) ఆల్‌టైమ్ రికార్డును బద్ధలు కొట్టాడు జకో. వింబుల్డన్‌లో 106వ విజయంతో ఫెదరర్‌ను అధిగమించాడీ సెర్బియా స్టార్.
ఏడుసార్లు వింబుల్డన్ ఛాంపియన్ జకోవిచ్ ఈసారి చెలరేగిపోతున్నాడు. 25వ గ్రాండ్‌స్లామ్‌పై గురి పెట్టిన జకో.. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్ చేరుకున్నాడు. రోమన్ సఫీల్లిన్(రష్యా) నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరకు.. 7-6(6), 6-3, 3-6, 6-3తో గెలుపొందిన అతడు ఫెదరర్ పేరిట ఉన్న అత్యధిక విజయాల(105) రికార్డును తన వశం చేసుకున్నాడు.
No man has won more matches at Wimbledon, ever.
Novak Djokovic overtakes Roger Federer’s record to secure a historic 106th gentlemen’s singles win at The Championships 👑 pic.twitter.com/sJ6Ee5nt7u
— Wimbledon (@Wimbledon) July 5, 2026
ఆదివారం సెంటర్ కోర్టులో రోమన్‌ను ఓడించడం ద్వారా ఈ మాజీ విజేత ఈ గ్రాస్ కోర్టు టోర్నీలో 106వ విజయం నమోదు చేశాడు. ఓపెన్ ఎరాలో ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఇన్నేసి విక్టరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Match: tough.
Support: incredible.
Celebration dance: needs practice 😆.
R4 idemoooo pic.twitter.com/UYFQS6Gbnp— Novak Djokovic (@DjokerNole) July 4, 2026