Novak Djokovic : ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి 25వ గ్రాండ్‌స్లామ్ పట్టేయాలనుకున్న నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) కల చెదిరేలా ఉంది. అందుకు కారణం సన్నాహక టోర్నీ ఇటాలియన్ ఓపెన్(Italian Open)లో జకో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఊహించని పరాభవంపై జకోవిచ్ స్పందిస్తూ.. తనను శారీరక ఇబ్బందులు వేధిస్తున్నాయని అంగీకరించాడు. వయసు పైబడుతుండడం, ఫిట్నెస్ పరమైన సమస్యలను తాను కొట్టిపారేయడడం లేదని జకో వెల్లడించాడు.
‘ఇటాలియన్ ఓపెన్‌కు బాగానే సన్నద్ధమయ్యాను. నిజాయతీగా చెప్పాలంటే నేను ఒక టోర్నీలో శారీరక ఇబ్బందులు పడినది గుర్తుకు లేదు. కానీ, ఇప్పుడు ఫిట్నెస్ సమస్యలు నన్ను వెంటాడుతున్నాయనేది కాదనలేని నిజం. ఇది ఒకరకంగా చాలా చిరాకు తెప్పిస్తోంది. కానీ, ఇలాంటి పరిస్థితుల్లోనూ నేను టెన్నిస్‌లో గొప్ప ప్రదర్శనలు చేయాలని నిర్ణయించుకున్నా’ అని జకోవిచ్ చెప్పాడు. పారిస్‌లో జరుగబోయే ఫ్రెంచ్ ఓపెన్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉంటారా? అనే ప్రశ్నకు సర్వశక్తులు ఒడ్డుతానని పేర్కొన్నాడు.
Novak Djokovic has decided that he won’t compete in any more clay-court events ahead of Roland Garros.
He’ll arrive in Paris without having won on a match on clay.
It will be only his 4th tournament of 2026. pic.twitter.com/oVdELJeRSN
— The Tennis Letter (@TheTennisLetter) May 8, 2026
‘ప్రస్తుతానికైతే నా పరిస్థితి అలానే ఉంది. టోర్నీకి సమయం ఉన్నందున నేను మరింత కష్టపడుతాను. నా శరీరం అనుమతించినంతవరకూ శిక్షణ తీసుకుంటా. ఈ శ్రమంతా కోర్టులో ఎలా పనికొస్తుంది అనేది ఊహించలేం’ అని జకోవిచ్ తెలిపాడు. మే 18వ తేదీ నుంచి ఫ్రెంచ్ ఓపెన్ షురూ కానుంది. జూన్ 7 వరకూ సాగే ఈ మట్టి కోర్టు పోరులో ఛాంపియన్‌గా నిలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది.
రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, ఆండీ ముర్రే.. వంటి దిగ్గజాలకు సవాల్ విసిరిన జకోవిచ్ ఖాతాలో ప్రస్తుతం 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఆస్ట్రేలియా ఓపెన్‌ను 10 సార్లు గెలచుకున్న ఈ సెర్బియా స్టార్ వింబుల్డన్‌లో ఏడు పర్యాయాలు ఛాంపియన్. యూఎస్ ఓపెన్‌లో నాలుగు, ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడు దఫాలు విజేత. ప్రస్తుతం పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ విజేత జకోవిచే.
ఒకప్పుడు దుమ్మురేపే ఆటతో ప్రత్యర్థులను వణికించిన ఈ సెర్బియా దిగ్గజం ఇటాలియన్ ఓపెన్‌లో 20 ఏళ్ల డినో ప్రిజ్మిక్కు తలొగ్గాడు. తొలి సెట్‌ను గెలుచుకున్నప్పటికీ చివరి రెండు సెట్లలో ప్రిజ్మిక్ ధాటికి జకోవిచ్ చేతులెత్తేశాడు. మొదటి సెట్‌ను 2-6తో కోల్పోయిన ఈ క్రొయేషియా క్వాలిఫయర్ 6-2, 6-4తో జకోకు చెక్ పెట్టి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
Dino Prizmic hits an enormous backhand down the line against Novak Djokovic in Rome.
Producing stunning stuff against his biggest tennis hero.
— The Tennis Letter (@TheTennisLetter) May 8, 2026