Dipa Karmakar | జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్.. ప్యారిస్ ఒలింపిక్స్‌పై గురిపెట్టిన దీప
Dipa Karmakar : భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్(Dipa Karmakar) ప్రతిష్ఠాత్మక సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ చాంపియన్‌షిప్స్(Senior National Championship) పోటీల్లో సత్తా చాటింది. అన్ని అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్...
Dipa Karmakar : భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్(Dipa Karmakar) ప్రతిష్ఠాత్మక సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ చాంపియన్‌షిప్స్(Senior National Championship) పోటీల్లో సత్తా చాటింది. అన్ని అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఎనిమిదేండ్ల విరామం తర్వాత ఈ పోటీల్లో బరిలోకి దిగిన దీప ఆల్‌రౌండ్ ప్రదర్శనతో స్వర్ణ పతకంతో మెరవడం విశేషం. ఈ విజయం స్ఫూర్తితో దీప ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics)పై గురి పెట్టింది.
‘చాలా సంతోషంగా ఉంది. ఎనిమిదేండ్ల తర్వాత నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నా. ఆల్‌రౌండ్ టైటిల్ గెలవడం ఎంతో తృప్తినిచ్చింది. ఇప్పుడు నా దృష్టంతా వరల్డ్ కప్ సిరీస్, ఆసియా చాంపియన్‌షిప్స్ (Asian Championship) మీదనే ఉంది’ అని దీప వెల్లడించింది. వ్యక్తిగత విభాగంలో 49.55 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. స్వస్తిక గంగూలీ 45.30 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక పోల్‌వాల్ట్‌లో ప్రణతి నాయక్ బంగారు పతకంతో మెరిసింది.
బ్రెజిల్లో 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ అదరగొట్టింది. ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచి భారతదేశం గర్వించేలా చేసింది. అయితే.. 2018లో వరల్డ్ కప్ సిరీస్ ముందు మోకాలి గాయంతో బాధపడిన ఆమె సర్జరీ చేయించుకుంది. నిషేధిత డ్రగ్ తీసుకుందనే కారణంతో 19వ ఆసియా గేమ్స్ పోటీలకు మందు దీపపై నిషేధం విధించారు. అన్ని ట్రయల్స్‌లో టాప్‌లో వచ్చినా ఆమెను పక్కన పెట్టేశారు. దాంతో, జాతీయ చాంపియన్‌షిప్‌ను దీప సీరియస్‌గా తీసుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో టైటిల్ కొల్లగొట్టడమే లక్ష్యంగా సాధన చేస్తోంది.
ఇవి కూడా చదవండి
- Siddipet | సిద్దిపేట చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం.. క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
- Mob Attacks Police | పోలీసులపై దాడి చేసి.. రౌడీ షీటర్‌ను విడిపించిన గుంపు
- David Warner | ఉప్పెనలా దూసుకొచ్చి.. ఊచకోతకు కేరాఫ్‌గా మారిన డేవిడ్ భాయ్.. వార్నర్ కెరీర్ సాగిందిలా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

