MS Dhoni | క్రికెట్ అకాడమీ పేరుతో ధోనీకి టోకరా.. 15 కోట్లు కొట్టేసిన ఇద్దరిపై క్రిమినల్ కేసు
MS Dhoni : కొత్త సంవత్సరం వేడుకలు ముగియడంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చాడు. వచ్చీ రావడంతోనే మహీ కోర్టును ఆశ్రయించాడు. క్రికెట్ అకాడమీ పేరుతో తనను మోసం చేసి రూ.15 కోట్లు కాజేసిన ఇద్దరిపై రాంచీ కోర్టులో...
MS Dhoni : కొత్త సంవత్సరం వేడుకలు ముగియడంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చాడు. వచ్చీ రావడంతోనే మహీ కోర్టును ఆశ్రయించాడు. క్రికెట్ అకాడమీ పేరుతో తనను మోసం చేసి రూ.15 కోట్లు కాజేసిన ఇద్దరిపై రాంచీ కోర్టులో కేసు పెట్టాడు. ధోనీ ఫిర్యాదుతో అర్కా స్కోర్ట్స్(Aarka Sports) యజమాని మిహిర్ దివాకర్(Mihir Diwakar), సౌమ్యా విశ్వాస్(Soumya Vishwas)లపై క్రిమిన్ కేసు నమోదు చేశారు.
మిహిర్, సౌమ్యాలు క్రికెట్ అకాడమీ పెడతామని 2017లో ధోనీతో ఒప్పందం చేసుకున్నారు. ఫ్రాంచైజ్ ఫీ, లాభాల్లో వాటా ఇస్తామని అగ్రిమెంట్లో రాసుకున్నారు. కానీ, నిబంధనలను తుంగలో తొక్కుతూ మహీ భాయ్‌ను మోసం చేశారు. దాంతో, ఈ స్టార్ క్రికెటర్ అర్కా స్పోర్ట్స్‌కు పలుమార్లు లీగల్ నోటీసులు పంపించాడు. అయినా సరే మిహిర్, సౌమ్యాలు స్పందించలేదు. ఇప్పటివరకూ ఫ్రాంచైజ్ ఫీ, లాభాల్లో వాటా రూపంలో ధోనీకి రూ. 15 కోట్లు ముట్టాలి. దాంతో, చివరి అస్త్రంగా అతడు కోర్టుకు వెళ్లాడు.

భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. ఐపీఎల్‌లోనూ సారథిగా అదరగొడుతున్నాడు. కుర్రాళ్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్‌ను 16వ సీజన్లో చాంపియన్‌గా నిలిపాడు. తన మార్క్ కెప్టెన్సీతో సీఎస్కేకు ఐదోసారి ట్రోఫీని అందించాడు. 17వ సీజన్లోనూ మహీ బరిలోకి దిగనున్నాడు. అయితే.. మోకాలి సర్జరీ నుంచి ఈమధ్యే కోలుకున్న ధోనీ 2024 ఎడిషన్‌లో టోర్నీ మొత్తం ఆడతాడా? కొన్ని మ్యాచ్‌లకే పరిమితమవుతాడా? అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
- Gautam Adani: ముఖేశ్ అంబానీని దాటేసిన గౌతమ్ అదానీ
- Overeating | ఈ అలవాట్లు వదిలించుకుంటే అతిగా తినరు
- Javed Ahmed | హిజ్బుల్ ఉగ్రవాది జావేద్ అహ్మద్‌కు 7 రోజుల పోలీస్ కస్టడీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

