Overeating : ఆకలి లేకపోయినా, కడుపు నిండినా ఆహారం తీసుకోవడాన్ని అతిగా తినడంగా చెబుతుంటారు. చాలాసార్లు మనలో ఎంతోమంది ఉద్దేశపూర్వకంగా కాకున్నా అదే పనిగా తింటూ ఉంటారు. సరైన ఆహార అలవాట్లు అలవరుచుకోకుంటే అతిగా తినడం అలవాటుగా మారి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. అతిగా తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, వికారం, కడుపు నొప్పి, అలసట వంటివి బాధిస్తాయి. ఆకలిని శరీరం నియంత్రించే శక్తి అతిగా తినడం వల్ల సన్నగిల్లి బరువు పెరిగేందుకు దారితీస్తుంది.
ఆపై మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు వెంటాడతాయి. ఆకలిగా లేకున్నా ఆహారం తీసుకునేందుకు పలు అలవాట్లు మనల్ని ప్రేరేపిస్తుంటాయి. ఆ అలవాట్లను అధిగమించడం ద్వారా అతిగా తినడాన్ని నియంత్రించి ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవచ్చు. ముఖ్యంగా ఆహారం తీసుకునే సమయంలో టీవీ, మూవీస్ చూడటం వంటివి నివారించాలి.
ఇక ఒత్తిడిలో ఉన్నప్పుడూ ఎలాంటి ఆహారం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. హై కార్టిసాల్ లెవల్స్ ఆకలిని ప్రేరేపించి షుగర్, కొవ్వు, సాల్ట్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకునేలా చేస్తుందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పేర్కొంది. ఇక అతిగా తినడాన్ని నివారించాలంటే ఈ ఐదు కారణాలను అధిగమించాలి..
టీవీ షో, సినిమా చూస్తూ తినడం
ఒత్తిడికి గురైనప్పుడు తినడం
బోర్‌గా ఉందని ఆహారం తీసుకోవడం
ఇంట్లో ఉన్నప్పుడు అతిగా తినడం
వేగంగా తినడం
Read More :