DCW vs UPWW | టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆఖరి పంచ్ ఎవరిదో..!
DCW vs UPWW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో చివరి ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే మ్యాచ్ మరికాసేపట్లో మొదలవ్వనుంది. కీలకమైన పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి జెమీమా రోడ్రిగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
DCW vs UPWW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో చివరి ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే మ్యాచ్ మరికాసేపట్లో మొదలవ్వనుంది. ఆరు పాయింట్లతో రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా నాకౌట్‌కు దూసుకెళ్తుంది. ఒకవేళ యూపీ వారియర్స్ గెలిస్తే ముంబై, ఢిల్లీతో పాటు యూపీ ఖాతాలో ఆరు పాయింట్లు చేరుతాయి. అప్పుడు నెట్రన్ రేటు ఆధారంగా చివరి బెర్తును ఖరారు చేస్తారు. ఇరుజట్లకు కీలకమైన పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి జెమీమా రోడ్రిగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఆరు విజయాలతో ఆర్సీబీ ఫైనల్ చేరగా.. గత పోరులో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన గుజరాత్ జెయింట్స్ నాకౌట్ బెర్తు సాధించింది. చివరి స్థానం కోసం ముంబై, ఢిల్లీ, యూపీ మధ్య పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచిందంటే 8 పాయింట్లతో దర్జాగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ.. యూపీ విజయం సాధిస్తే అప్పుడు నెట్‌రన్‌రేటు కీలకమవుతుంది.
Playing XIs of @DelhiCapitals and @UPWarriorz are locked in 🔒
Updates ▶️ https://t.co/KvgnknMN0z #TATAWPL | #KhelEmotionKa | #DCvUPW pic.twitter.com/DQ252Y36H8
— Women’s Premier League (WPL) (@wplt20) February 1, 2026
ఢిల్లీ తుది జట్టు : షఫాలీ వర్మ, లిజెల్లె లీ(వికెట్ కీపర్), లారా వొల్వార్డ్త్, జెమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), మరిజానే కాప్, చినెల్లే హెన్రీ, నికీ ప్రసాద్, మిన్ను మణి, స్నేహ్ రానా, శ్రీ చరణి, నందిని శర్మ.
యూపీ తుది జట్టు : మేగ్ లానింగ్(కెప్టెన్), సిమ్రన్ షేక్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, షిప్రా గిరి(వికెట్ కీపర్), డియాండ్ర డాటిన్, చార్లీ నాట్, సోఫీ ఎకిల్‌స్టోన్, అశా శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

