DC vs CSK | పవర్ ప్లేలోనే కంగుతిన్న ఢిల్లీ.. ఓపెనర్లు ఔట్..!
DC vs CSK : సొంతడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగుతోంది. మొన్న ఆర్సీబీపై పవర్ ప్లేలోనే పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఢిల్లీని ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు వణికిస్తున్నారు.
DC vs CSK : సొంతడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగుతోంది. మొన్న ఆర్సీబీపై పవర్ ప్లేలోనే పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఢిల్లీని ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు వణికిస్తున్నారు. గత మ్యాచ్‌లో 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ముకేశ్ వేసిన ఐదో ఓవర్లో వరసగా 4, 6 బాదిన పథుమ్ నిశాంక(19) స్ట్రెయిట్ షాట్ ఆడి బ్రెవిస్ చేతికి చిక్కాడు. కాసేపటికే హొసేన్ ఓవర్లో కేఎల్ రాహుల్ (12) సైతం బంతిని గాల్లోకి లేపి వెనుదిరిగాడు.
టాస్ గెలిచి భారీస్కోర్ కొట్టాలనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు నిశాంక(19), కేఎల్ రాహుల్(12) శుభారంభమివ్వకుండానే ఔటయ్యారు. ముకుల్ ఓవర్లో నిశాంక, హొసేన్ బౌలింగ్‌లో రాహుల్ పెద్ద షాట్ ఆడేక్రమంలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. వెంట వెంటనే రెండు వికెట్లు పడడంతో ఢిల్లీ పవర్ ప్లేలో 37 పరుగులకే పరిమితమైంది, కరుణ్ నాయర్(1 నాటౌట్), నితీశ్ రానా(5 నాటౌట్)లు ఆడుతున్నారు.
Glorious shot 👌
Rapid response 🔥🎥 Mukesh Choudhary has the last laugh in the mini-battle with Pathum Nissanka 💛
Updates ▶️ https://t.co/f1bRZthndy#TATAIPL | #KhelBindaas | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/yl5X8CZOXD
— IndianPremierLeague (@IPL) May 5, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

