DCW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్లో ఎలిమినేటర్ మ్యాచ్ కాసేపట్లో మొదలవ్వనుంది. గత మూడు సీజన్లలో ఫైనల్ చేరినా విజేతగా నిలవని ఢిల్లీ క్యాపిటల్స్, తొలిసారి టైటిల్ పోరుకు దూసుకెళ్లాలనుకుంటున్న గుజరాత్ జెయింట్స్ హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. గెలిస్తే ఫైనల్.. ఓడితే ఇంటికే వెళ్లాల్సిన ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
లీగ్ దశలో నువ్వానేనా అన్నట్టు తలపడిన గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. ఆఖరి ఓవర్ వరకూ పోరాడి.. రెండుసార్లు స్వల్ప తేడాతో గుజరాత్ చేతిలో ఓడిన ఢిల్లీ.. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. గత మూడు సీజన్లలో ఒక్కసారి కూడా ఫైనల్ ఆడని గుజరాత్ జట్టు ఈసారి విదేశీ స్టార్ల మెరుపులతో నాకౌట్ వరకూ వచ్చింది. ఢిల్లీని ఓడించిందంటే తొలిసారి టైటిల్ పోరులో తలపడుతుంది.
Game on in Vadodara 🧡💙
Bring on the #TATAWPL Eliminator 💪
Updates ▶️ https://t.co/seGdvpFWwh #ClaimTheCrown | #GGvDC | #Eliminator | @Giant_Cricket | @DelhiCapitals pic.twitter.com/md5ujZ6tro
— Women’s Premier League (WPL) (@wplt20) February 3, 2026
గుజరాత్ జెయింట్స్ తుది జట్టు : బేత్ మూనీ(వికెట్ కీపర్), సోఫీ డెవినె, అనుష్క శర్మ, అష్లీ గార్డ్నర్(కెప్టెన్), జార్జియా వరేహం, భారతి ఫుల్మాలి, కనికా ఆహుజా, కష్వీ గౌతమ్, తనూజ కన్వర్, రేణుకా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు : షఫాలీ వర్మ, లిజెల్లే లీ (వికెట్ కీపర్), లారా వొల్వార్డ్త్, జెమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), మరిజానే కాప్, చిన్నె్ల్లే హెన్రీ, నిక్కీ ప్రసాద్, స్నేహ్ రానా, మిన్ను మణి, శ్రీ చరణి, నందిని శర్మ.