మాడ్రిడ్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి స్పెయిన్ నయాబుల్ కార్లోస్ అల్కరాజ్ గాయం కారణంగా దూరమయ్యాడు. కుడిచేతి మణికట్టు గాయంతో టోర్నీలో ఆడలేకపోతున్నట్లు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అల్కరాజ్ ప్రకటించాడు. దీంతో వరుసగా మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచే అవకాశాన్ని దూరం చేసుకున్నాడు.