MI vs UPW : ముంబై ఇండియన్స్(Mumbai Indians) బిగ్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (25) ఐదో వికెట్‌గా వెనుదిరిగింది. 78 పరుగుల వద్ద ఆమె ఔటయ్యింది. ప్రస్తుతం ఇసీ వాంగ్, అమన్జ్యోతి క్రీజులో ఉన్నారు. అంతకుముందు పర్షవి చోప్రా ఓవర్లో అమేలియా కేర్ (3) ఔటయ్యింది. అంతకుముందు ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో ఓపెనర్ హేలీ మాథ్యూస్ (35) ఔటయ్యింది. కీపర్ హేలీ క్యాచ్ పట్టడంతో ఆమె వెనుదిరిగింది. దాంతో, 57 రన్స్ వద్ద ముంబై మూడో వికెట్ పడింది. 13 ఓవర్లకు ముంబై జట్టు మూడు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. యస్తికా భాటియా(7), నాట్ సీవర్ బ్రంట్ (5) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.