ఢిల్లీ బ్యాటర్ మిచెల్ మార్ష్ అవుటయ్యాడు. ఓపెనర్ పృథ్వీ షా (5) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. దంచికొట్టాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 20 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. అయితే కృష్ణప్ప గౌతమ్ వేసిన ఎనిమిదో ఓవర్ తొలి బంతికే అవుటయ్యాడు. గౌతమ్ వేసిన బంతిని రూమ్ తీసుకొని డ్రైవ్ చేయడానికి మార్ష్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ చేతుల్లో పడింది. గౌతమ్ అప్పీల్ చేసినా.. అవుట్ ఇవ్వని అంపైర్ కాసేపు ఆలోచించి అవుట్ ఇచ్చాడు. మార్ష్ నిరాశగా వెనుతిరిగాడు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు ఎక్కడా కనిపించలేదు. మార్ష్ కనుక రివ్యూ కోరి ఉంటే నాటౌట్ అని తేలేది. కానీ అతను రివ్యూ తీసుకోకపోవడంతో ఢిల్లీ జట్టు మూడో వికెట్ కోల్పోయింది.