IPL 2023 | కోల్‌కతా బ్యాటర్ రస్సెల్ కొంటె చేష్ట.. సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం
IPL 2023 | ఐపీఎల్ సీజన్-16లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు ఈ సీజన్లో తన ఖాతా తెరించింది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు ఈ సీజన్లో తన ఖాతా తెరించింది. ఎందుకంటే అంతకుముందు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఢిల్లీ టీమ్ వరుసగా ఓటములను మూటగట్టుకుంది.
అయితే ఈ మ్యాచ్ 15వ ఓవర్లో కోల్‌కతా బ్యాటర్ అండ్రూ రస్సెల్ చేసిన ఒక కొంటె చేష్ట ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆ కొంటె చేష్టకు సంబంధించిన ఫొటోను రాహుల్ శర్మ అనే వ్యక్తి తన ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేయగా.. నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. ఇంతకూ రస్సెల్ చేసిన కొంటె పని ఏందో తెలుసా..?
కోల్‌కతా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో కులదీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు. వెంటవెంటనే రెండు వికెట్లు తీసిన కులదీప్ మరో వికెట్ తీస్తే హ్యాట్రిక్ అవుతుంది. ఉమేశ్ యాదవ్ బ్యాటింగ్‌కు వచ్చి స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. అప్పటికే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రస్సెల్ స్ట్రైకింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ బంతి విసురుతుండగా.. అదేమీ పట్టనట్లు రస్సెల్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో కుడివైపు తిరిగి బ్యాటింగ్ పొజిషన్లో నిలబడ్డాడు.
ఆ ఫోజుకు సంబంధించిన ఫొటోను రాహుల్ శర్మ తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశాడు. దానిపై నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
Kuldeep Yadav on a hat-trick.
Look at Andre Russell : pic.twitter.com/BqLlJEGxrD
— Rahul Sharma (@CricFnatic) April 20, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

