DC vs PBKS : పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ధర్మశాలలో రెండొందలు కొట్టిన పంజాబ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడించింది. 211 పరుగుల ఛేదనలో టాపార్డర్ విఫలమైనా.. అక్షర్ పటేల్(56) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు డేవిడ్ మిల్లర్(51)లు కంగారు పడలేదు. కాస్త కుదురుకున్నాక గేర్ మార్చిన ఇద్దరూ అర్ధ శతకాలతో మెరవగా.. ఇంప్యాక్ట్ సబ్ అశుతోష్ శర్మ(24), అకీబ్ నబీ(10 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వకుండా లాంఛనం పూర్తి చేశారు. దాంతో, పంజాబ్‌కు వరుసగా నాలుగో ఓటమి ఎదురవ్వగా.. ఐదో విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.
ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఢిల్లీ క్యాపిటల్స్ అదిరే విజయంతో ముందంజ వేసింది. గత మ్యాచ్‌లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆశలు సజీవంగా ఉంచుకుంది. సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్(56), డేవిడ్ మిల్లర్(51) వీరబాదుడుతో పంజాబ్‌పై ప్రతీకార విక్టరీతో మురిసింది ఢిల్లీ.
Ice in their veins and pure fire in their bats! 🧊🔥
Madhav Tiwari & Ashutosh Sharma with match-winning clutch cameos to seal the deal for #DC 🫡
Updates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC | @DelhiCapitals pic.twitter.com/ZqwSxTCrhj
— IndianPremierLeague (@IPL) May 11, 2026
ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే షాకిచ్చాడు యశ్ ఠాకూర్. అభిషేక్ పొరెల్(5)ను బౌల్డ్ చేయగా.. అర్ష్‌దీప్ ఓవర్లో ఫోర్ బాదిన కేఎల్ రాహుల్(9).. షార్ట్ బంతికి దొరికిపోయాడు. 14 పరుగులకే ఓపెనర్లు డగౌట్ చేరారు. ఓ సిక్సర్‌తో అలరించిన కుర్రాడు సహిల్ పరాక్ (౦) సైతం అర్ష్‌దీప్ ఓవర్లో స్లిప్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చేశాడు. అనంతరం కెప్టెన్ అక్షర్ పటేల్(56), స్టబ్స్(12) దూకుడుగా ఆడారు. స్టోయినిస్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన అక్షర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు.
Twist in the tale 👀
David Miller departs right after his fifty courtesy of an exceptional catch by Prabhsimran Singh ✨
Updates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC pic.twitter.com/72gJm9r9vr
— IndianPremierLeague (@IPL) May 11, 2026
అయినా.. డేవిడ్ మిల్లర్(51) బౌండరీలతో భయపెట్టాడు. ద్వారుషీ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన ఈ డాషింగ్ బ్యాటర్ ఆ తర్వాత వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఇంప్యాక్ట్ సబ్ అశుతోష్ శర్మ(24) పట్టువదల్లేదు. స్టోయినిస్ వేసిన 17వ ఓవర్లో అశుతోష్ 4, 6 .. మధవ్ తివారీ(18 నాటౌట్) సిక్సర్ బాదగా 19 రన్స్ వచ్చాయి. కానీ, తర్వాతి ఓవర్లో అశుతోష్ ఔటయ్యాడు. దాంతో.. ఉత్కంఠ నెలకొంది. కానీ, అకీబ్ నబీ(10 నాటౌట్) వస్తూనే ఫోర్, సిక్సర్‌తో ఢిల్లీకి మూడు వికెట్ల విజయాన్ని అందించాడు.
Captain masterclass under pressure 🫡
Axar Patel departs after a very important 56(30) 👏
Updates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC pic.twitter.com/TZSJL8YPJh
— IndianPremierLeague (@IPL) May 11, 2026
సొంత మైదానమైన ధర్మశాలలో తొలుత ఆడిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(56) విధ్వంసక ఆటతో రెచ్చిపోగా.. పవర్ ప్లేలో ఢిల్లీ బౌలర్లు నీరుగారిపోయారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్(18)తో కలిసి దంచేశాడు.
ముకేశ్ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ ఔటవ్వగా తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కూపర్ కొన్నొల్లీ(38) అండగా మిడిల్ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్(59 నాటౌట్) దంచేశాడు. ఆఖర్లో మిచెల్ స్టార్క్(2-57) రెండు వికెట్లు తీసినా సూర్యాన్ష్ షెడ్గే(21 నాటౌట్) మెరుపులతో పంజాబ్ స్కోర్ రెండొందలు దాటింది. కానీ, చివరి ఓవర్లో ఎంగిడి ఏడు పరుగులే ఇవ్వగా పంజాబ్ 210కి పరిమితమైంది.