సింహం ఒక అడుగు వెనుకకు వేసిందంటే.. పదడుగులు ముందుకు దూకేందుకు సిద్ధమైందన్నట్లు! సముద్రం కాస్త వెనక్కి వెళ్లిందంటే.. మరింత ముందుకు దూసుకొచ్చి ముంచేస్తుందన్నట్లు!! ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయిన డేవిడ్ వార్నర్.. నెల రోజుల వ్యవధిలో ప్రపంచకప్ ‘ప్లేయర్
ఆఫ్ ది టోర్నీ’గా నిలిచి తనలో సత్తా తగ్గలేదని ప్రపంచానికి చాటాడు!
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడేవెతుక్కోవాలన్న చందంగా.. నెల రోజుల క్రితం ఇక్కడే జరిగిన ఐపీఎల్లో కనీసం జట్టు సభ్యులతో కలిసి డగౌట్లో కూడా కూర్చోలేకపోయిన వార్నర్.. విశ్వవిజేతగా నిలిచాక మైదానమంతా కలియతిరుగుతూ సింహనాదం చేశాడు. పడిలేవడం అంటే ఏంటో.. కమ్‌బ్యాక్ అంటే ఎలా ఉండాలో తన ఆటతో నిరూపించిన ‘డేవిడ్ భాయ్’ వరల్డ్ కప్ జర్నీపై ఓ లుక్కేస్తే..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:ఏమాత్రం అంచనాల్లేకుండా యూఏఈలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు.. పొట్టి ఫార్మాట్లో తొలి ప్రపంచకప్‌ను ముద్దాడిందంటే అందుకు ప్రధాన కారణం ఓపెనర్ డేవిడ్ వార్నర్ అనడంలో సందేహం లేదనేది విశ్లేషకుల వ్యాఖ్య. మెగాటోర్నీకి ముందు గాయాల బెడద, కీలక ఆటగాళ్ల ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది పడిన కంగారూలు.. కప్పు కొట్టారంటే అది ‘డేవిడ్ భాయ్’ చలవే అనేది అభిమానుల మనోగతం. పదకొండు మంది కలిసి ఆడే ఆటలో ఒక్క ప్లేయర్ వల్లే జట్టు విజయాలు సాధిస్తుందనడం అతిశయోక్తిగా అనిపించినా.. ప్రపంచకప్‌లో వార్నర్ ఆటతీరు చూసిన వారెవరైనా దీన్ని అంగీకరించి తీరాల్సిందే. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయిన వార్నర్ ఆ కసినంతా ఇక్కడ చూపిస్తూ.. 289 పరుగులు ఖాతాలో వేసుకొని ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు చేజిక్కించుకున్నా డు. లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అతడు.. క్వార్టర్ ఫైనల్ లాంటి వెస్టిండీస్‌తో పోరు లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బలమై న జట్లు ఉన్న గ్రూప్-1 నుంచి నాకౌట్‌కు చేరాలంటే రన్‌రేట్ కీలకమైన సమయంలో తన విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. ఇక పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లో మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్ విధ్వంసం వల్ల ఆసీస్ గెలిచినట్లు అనిపించినా.. వారికి అవసరమైన ప్లాట్‌ఫామ్ ఇచ్చింది మాత్రం కచ్చితంగా వార్నరే.
ఫుల్ జోష్‌లో ఉన్న షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, రవుఫ్లపై ఎదురుదాడికి దిగిన వార్నర్ 30 బంతుల్లోనే 49 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఫించ్, స్మిత్, మ్యాక్స్‌వెల్ కనీసం క్రీజులో నిలువలేకపోయిన చోట డేవిడ్ తన క్లాస్ ఏంటో నిరూపించుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అంపైర్ తప్పుడు నిర్ణయానికి వికెట్ సమర్పించుకొని అర్ధశతకానికి ఒక పరుగు దూరంలో పెవిలియన్ చేరాడు. ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో సన్‌రైజర్స్ జట్టులో తన సహచరుడు కేన్ విలియమ్సన్ కళాత్మక విధ్వంసం సృష్టించడంతో ఆసీస్ ముందు భారీ లక్ష్యమే నిలిచింది. వాస్తవానికి అప్పటి వరకు ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అదే అత్యధిక స్కోరు. బౌల్ట్, సౌథీ, మిల్నే వంటి ప్రమాదకర బౌలర్లను ఎదుర్కొనేందుకు క్రీజులో అడుగుపెట్టిన వార్నర్ ఆరంభంలో ఆచితూచి ఆడినా.. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడి కంగారూలకు శుభారంభాన్నిచ్చాడు. మ్యాచ్ పూర్తయ్యాక మార్ష్ టాప్ స్కోరర్‌గా కనిపిస్తున్నా.. అతడికి స్వేచ్చగా ఆడే వెసులుబాటు ఇచ్చింది వార్నర్ ఇన్నింగ్సే. మొత్తానికి మునుపటి ఫామ్‌ను చాటుకున్న వార్నర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని పునరాలోచనలో పడేశాడు.
కొసమెరుపు
ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచాక ఓ విలేకరి.. ‘వార్నర్‌కు ఎలా మద్దతిచ్చారు. అతడు మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు’ అని కెప్టెన్ ఫించ్‌ను ప్రశ్నించగా.. ‘నువ్వు ఊహించ లేదేమో.. నేను ఊహించా. టోర్నీ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే జస్టిన్ లాంగర్‌తో ఈ విషయం చెప్పా. వార్నర్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అతడు ‘ఫ్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు కైవసం చేసుకుంటాడు అని చెప్పా. నా మాటలను డేవిడ్ నిజం చేశాడు’ అని బదులిచ్చాడు.
కిరాక్ ట్వీట్
సన్‌రైజర్స్ యాజమాన్యం వార్నర్ పట్ల వ్యవహరించిన తీరుతో విసుగుచెందిందో లేక.. భర్తను సరదాగా ఆట పట్టించాలనుకుందో కానీ.. మ్యాచ్ అనంతరం వార్నర్
సతీమణి క్యాండిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఫామ్‌లో లేడు.. ముసలివాడు.. నెమ్మదిగా ఆడతాడు!! కంగ్రాట్స్ డేవిడ్ వార్నర్’ అని ట్వీట్ చేసింది.