David Warner | ‘నువ్వు నా ప్రపంచం.. ప్రతి సందర్భంలో వెన్నంటి ఉన్నందుకు థాంక్యూ’ : వార్నర్
David Warner : ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(SCG)లో హాఫ్ సెంచరీతో కదం తొక్కిన డేవిడ్ భాయ్ విజయంతో కెరీర్‌ను ముగించాడు. చివరి టెస్టు మ్యాచ్ అనంతరం వార్నర్ స్టేడియంలో కుటుంబ...
David Warner : ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(SCG)లో హాఫ్ సెంచరీతో కదం తొక్కిన డేవిడ్ భాయ్ విజయంతో కెరీర్‌ను ముగించాడు. చివరి టెస్టు మ్యాచ్ అనంతరం వార్నర్ స్టేడియంలో కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగాడు. ఈ సందర్బంగా భావోద్వేగానికి లోనైన ఈ స్టార్ క్రికెటర్ కుటుంబసభ్యులకు థ్యాంక్స్ చెప్పాడు. ముఖ్యంగా ఎల్లవేళలా మద్దుతుగా నిలిచిన భార్య క్యాండిసె(Candice)కు వార్నర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
‘మన జీవితంలో కుటుంబసభ్యుల సహకారం లేకుండా ఏమీ సాధించలేం. నా జీవితాన్ని అందంగా మలిచిన అమ్మానాన్నకు ధన్యవాదాలు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు కారణమైన సోదరుడు స్టీవ్‌కు థాంక్స్. ఇక క్యాండిసెతో నాకు అందమైన కుటుంబం ఉంది. నా జీవితంలో ప్రతి క్షణాన్ని ఆమెతో పంచుకుంటాను. నా కుటుంబాన్ని ప్రాణం పోయేంతవరకూ ప్రేమిస్తాను. ఇంకా చెప్పాలని ఉంది కానీ ఎమోషనల్ అవుతాను. ఇన్నేండ్ల ప్రయాణంలో నా వెన్నంటి నిలిచిన క్యాండిసెను థ్యాంక్స్. ఎందుకంటే.. నువ్వే నా ప్రపంచం’ అని వార్నర్ వెల్లడించాడు.
Warner with his family 🥹 ❤️ pic.twitter.com/TREeeknYjF
— ESPNcricinfo (@ESPNcricinfo) January 6, 2024
వార్నర్, క్యాండిసె 2015 ఏప్రిల్‌లో పెండ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇవీ(Ivy), ఇండీ(Indi), ఇస్లా(Isla) అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. క్రికెట్ నుంచి ఏకొంచెం బ్రేక్ దొరికినా వార్నర్ ఫ్యామిలీతో గడుపుతాడు. ముగ్గురు పిల్లలతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటాడు.
కరోనా విజృంభణతో క్రికెట్ టోర్నీలు ఆగిపోయన లాక్డౌన్ టైమ్‌లో డేవిడ్ భాయ్ ఇన్‌స్టాలో చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఆస్ట్రేలియా గొప్ప క్రికెటర్లలో ఒకడైన వార్నర్ 112 టెస్టుల్లో 44.59 సగుటతో 8,786 పరుగులు సాధించాడు. 26 శతకాలు, 37 హాఫ్ సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. మరో విషయం ఏంటంటే.. కెరీర్లో చివరి వన్డేలో ప్రపంచ చాంపియన్‌గా, చివరి టెస్టులో విజేతగా నిలవడం వార్నర్‌కే సాధ్యమైంది.
ఇవి కూడా చదవండి
- Rafeal Nadal | తిరగబెట్టిన కండరాల నొప్పి.. క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన స్పెయిన్ బుల్
- Ambati Rayudu | మూణాళ్ల ముచ్చటేనా..వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై !
- Alaska Airlines: టేకాఫ్ తర్వాత సడెన్‌గా తెరుచుకున్న డోరు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- candice
- David Warner
- indy
- isla
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

