Alaska Airlines: టేకాఫ్ తర్వాత సడెన్‌గా తెరుచుకున్న డోరు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో
Alaska Airlines : విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత సడెన్‌గా కిటికి డోరు తెరుచుకున్నది. ఈ ఘటన అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ విమానాశ్రయంలో జరిగింది. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ తర్వాత ఒడిదిడుకులకు లోనైంది. విమానం గాలిలోనే ఉన్నప్పుడే డోరు తెరుచుకోవడంతో దాన్ని దించేశారు.
న్యూఢిల్లీ: అలస్కా ఎయిర్‌లైన్స్(Alaska Airlines)కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకు ఆ విమానం డోరు సడెన్‌గా తెరుచుకున్నది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానంలో ఉన్న ప్రయాణికులు ఆ వీడియోలు తీశారు.
విమానం నుంచి ఎగ్జిట్ డోరు వేరైనట్లు తెలుస్తోంది. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ సిటీ నుంచి ఏఎస్1282 విమానం టేకాఫ్ తీసుకున్నది. టేకాఫ్ తర్వాత విమానం డోరు ఊడిపోవడంతో దాన్ని వెంటనే దీంచేశారు. పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఆ విమానం ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
ఈ ఘటన గురించి త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు అలస్కా ఎయిర్‌లైన్స్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. విమానం డోరు తెరుచుకున్న సమయంలో ప్రయాణికుల వద్ద ఉన్న ఫోన్లు గాలిలో ఎగిరిపోయాయి. డీప్రెజర్ కావడంతో కొందరి చేతుల్లో ఉన్న ఫోన్లు బయటకు వెళ్లిపోయాయి. ఒక చిన్న పిల్లోడి షర్ట్ కూడా ఊడిపోయింది. అయితే ప్రస్తుతం ప్రయాణికులు అంతా సేఫ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
Alaska Airlines Forced to Make an Emergency Landing After Large Aircraft Window Blows Out Mid-Air.
The situation was so bad a child’s shirt was ripped off. pic.twitter.com/y4yMA12Iq0
— DramaAlert (@DramaAlert) January 6, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

