David Warner | వార్నర్ టోపీ దొరికింది.. ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన డేవిడ్ భాయ్
David Warner : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) పోగొట్టుకున్న గ్రీన్ టోపీ(Baggy Green Cap) దొరికింది. సిడ్నీలో ఆసీస్ ఆటగాళ్లు బసలోని హోట్‌లో ఆ క్యాప్ లభించిం ది. దాంతో, వార్నర్ తెగ సంబురపడిపోయాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా....
David Warner : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) పోగొట్టుకున్న గ్రీన్ టోపీ(Baggy Green Cap) దొరికింది. సిడ్నీలో ఆసీస్ ఆటగాళ్లు బసలోని హోట్‌లో ఆ క్యాప్ లభించిం ది. దాంతో, వార్నర్ తెగ సంబురపడిపోయాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
‘అందరికీ నమస్కారం. నాకెంతో ఇష్టమైన గ్రీన్ క్యాప్ దొరికిందనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇదొక గొప్ప విషయం. ఈ టోపీ దొరకడంలో నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా కార్గో కంపెనీ, హోటల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని డేవిడ్ భాయ్ ఇన్‌స్టా వీడియోలో తెలిపాడు.
బాక్సింగ్ డే టెస్టుకు ముందు వార్నర్ తన బ్యాక్ ప్యాక్ పోయిందని, అందులో తనకెంతో ఇష్టమైన టోపీ ఉందని సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ క్యాప్ నాకు చాలా సెంటిమెంట్. అది పెట్టుకొనే నా చివరి టెస్టు మ్యాచ్ ఆడాలని అనుకున్నా. ఎవరికైనా దొరికితే వెంటనే నాకు ఇచ్చేయండి అని ఈ డాషింగ్ బ్యాటర్ కోరాడు. అయితే.. రెండు రోజుల్లోనే క్యాప్ కనిపించడంతో వార్నర్ హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నాడు. ఆ క్యాప్‌తోనే శుక్రవారం వార్నర్ మైదానంలోకి దిగాడు.

సిడ్నీ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు, వన్డేలకూ వార్నర్ వీడ్కోలు పలుకుతున్న విషయం తెలిసిందే. దాంతో, కమిన్స్ సేన సిరీస్ విజయాన్ని అతడికి గొప్ప కానుకగా ఇవ్వాలని భావిస్తోంది. ఆ దిశగా ఆసీస్ జట్టు ఓ అడుగేసిందనే చెప్పాలి. అవును.. మూడో రోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 68 రన్స్ చేసింది. పాక్ ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్ విజృంభిస్తే తొలి సెషనల్లో సాద్ షకీల్ సేన ఆలౌటవ్వడం ఖాయం. అదే జరిగితే.. టీ సెషన్ కల్లా మ్యాచ్ ముగిసే చాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి
- Naa Saami Ranga | ‘నా సామిరంగ’ నుంచి విజిల్ థీమ్ సాంగ్ రిలీజ్
- Madhuri Dixit | చీరకట్టులో కేకపుట్టిస్తున్న మాధురీ దీక్షిత్..
- Heavy traffic jam | హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

