Naa Saami Ranga | ‘నా సామిరంగ’ నుంచి విజిల్ థీమ్ సాంగ్ రిలీజ్
Naa Saami Ranga | టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటిస్తున్న పూర్తిస్థాయి మాస్ చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత.
Naa Saami Ranga | టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటిస్తున్న పూర్తిస్థాయి మాస్ చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, అల్లరి నరేష్ ఇంట్రోను చిత్రబృందం విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ నుంచి కొత్త సాంగ్ విడుదల చేశారు.
విజిల్ థీమ్ సాంగ్ అంటూ ఈ పాట ఉండగా.. దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం. అంజి ది కిష్టయ్యది విడదియ్యని ఒక బంధం అంటూ ఫుల్ ఎమోషనల్‌గా ఉంది.. ఈ పాటలో నాగార్జున, అల్లరి నరేష్ మధ్య ఉన్న బాండింగ్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ పాటకు ఆస్కార్ విన్నింగ్ లెజెండరీ కంపోజర్ ఎంఎం కీరవాణి సాహిత్యంతో పాటు సంగీతం అందించగా.. శాండిల్య పిసాపాటి పాడారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

