David Warner | హెలిక్యాప్టర్‌లో సిడ్నీ స్టేడియానికి.. వార్నర్ ఎంట్రీ వీడియో వైరల్
David Warner : సుదీర్ఘ ఫార్మాట్‌తో పాటు వన్డేలకు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) ఇక టీ20 లీగ్‌లో మెరవనున్నాడు. అది కూడా సొంత గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(BigBash League)లో ఈ స్టార్ బ్యాటర్ ఆడనున్నాడు. బీబీఎల్‌లో తొలి మ్యాచ్ కోసం ఈ డాషింగ్ బ్యాటర్...
David Warner : సుదీర్ఘ ఫార్మాట్‌తో పాటు వన్డేలకు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) ఇక టీ20 లీగ్‌లో మెరవనున్నాడు. అది కూడా సొంత గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(BigBash League)లో ఈ స్టార్ బ్యాటర్ ఆడనున్నాడు. బీబీఎల్‌లో తొలి మ్యాచ్ కోసం ఈ డాషింగ్ బ్యాటర్ ఓ రేంజ్లో వెళ్లాడు. అచ్చం హాలీవుడ్ హీరో మాదిరిగా హెలిక్యాప్టర్(Helicopter)లో వచ్చిన వార్నర్ సిడ్సీ మైదానంలో దిగాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
జనవరి 12 శుక్రవారం సాయంత్రం సిడ్నీ సిక్సర్స్(Sydney Sixers)తో వార్నర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఉదయాన్నే హంటర్ హ్యలీ ప్రాంతంలో వార్నర్ సోదరుడి పెండ్లికి హాజరైన వార్నర్.. అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు ప్రైవేట్ హెలిక్యాప్టర్‌లో సిడ్నీకి బయలుదేరాడు. ఔట్‌ఫీల్డ్‌లో హెలిక్యాప్టర్ ల్యాండ్ కాగానే దిగి గబగబా బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యాడు.
Dave Warner.
In a Helicopter.
Arriving at the SCG.Here’s how it happened. @davidwarner31 @ThunderBBL @scg #BBL13 pic.twitter.com/v7QRCkauH5
— KFC Big Bash League (@BBL) January 12, 2024
స్టీవ్ స్మిత్ నేతృత్వం వహిస్తున్న సిడ్నీ సిక్సర్స్(Sydney Sixers)తో వార్నర్ తొలి మ్యాచ్ ఆడనున్నాడు. అయితే.. లీగ్ దశలో తేలిపోయిన సిడ్నీ థడర్స్ జట్టు చివరి మూడు మ్యాచుల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల అనంతరం ఇంటర్నేషనల్ టీ20 లీగ్(ILT20) కోసం వార్నర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లనున్నాడు.
David Warner is in the building 😎#ThunderNation pic.twitter.com/utrkGtcGeu
— Sydney Thunder (@ThunderBBL) January 12, 2024
అక్కడ డేవిడ్ భాయ్ దుబాయ్ క్యాపిటల్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకున్న వార్నర్ స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆడే చాన్స్ ఉంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ పొట్టి సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా అతడి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
- Prashanth Varma | హనుమాన్ మూవీ ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ వర్మ
- MLA Kaushik Reddy | 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలి.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్
- Asian Olympic Qualifiers | భారత షూటర్ల పతకాల పంట.. షోరాన్కు పసిడి, తోమర్‌కు సిల్వర్ మెడల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

