వందో టెస్టులో వార్నర్ డబుల్ సెంచరీ
స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (254 బంతుల్లో 200 రిటైర్డ్ హర్ట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు.
- ఆస్ట్రేలియా 386/3 l దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు
విధ్వంసక వీరుడు డేవిడ్ వార్నర్ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు. క్రికెట్ ఆస్ట్రేలియాతో వైరం.. కెప్టెన్సీ వివాదం.. పేలవ ఫామ్‌తో నైరాశ్యం.. ఇక తప్పుకుంటేనే మేలనే వ్యాఖ్యలు.. ఇలా గత కొన్నాళ్లుగా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిచిన వార్నర్.. ఒక్క ఇన్నింగ్స్‌తో వాటన్నింటికి చెక్ పెట్టాడు. సఫారీ బౌలింగ్‌ను తుత్తునియాలు చేస్తూ.. వన్డే తరహాలో విజృంభించిన వార్నర్.. తన వందో టెస్టులో డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుపై పట్టు సాధించింది.
మెల్బోర్న్: స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (254 బంతుల్లో 200 రిటైర్డ్ హర్ట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. గత కొన్నాళ్లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న వార్నర్.. కెరీర్ వందో టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగాడు. వార్నర్ దంచుడుతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరుపై కన్నేసింది. రెండో రోజు ఆట నిలిచిపోయే సమయానికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. వార్నర్ ద్విశతకం నమోదు చేసుకోగా.. స్టీవ్ స్మిత్ (85), ట్రావిస్ హెడ్ (48 బ్యాటింగ్) రాణించారు. తొలి టెస్టులో నిప్పులు చెరిగిన సఫారీ పేసర్లు ఈ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. రబడ, నోర్జే చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. నోర్జే నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తూ ఆసీస్‌ను భయపెట్టే ప్రయత్నం చేసినా.. వార్నర్ ఆ దాడిని సమర్థంగా తిప్పికొట్టాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆసీస్ ప్రత్యర్థి కంటే 197 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. డబుల్ సెంచరీ అనంతరం వార్నర్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగగా.. యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అతడిని అనుసరించాడు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ఓవర్‌నైట్ స్కోరు 45/1తో మంగళవారం రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా.. రోజంతా ఆడి మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. దాదాపు మూడేండ్ల తర్వాత వార్నర్ సెంచరీతో కదం తొక్కితే అతడికి స్టీవ్ స్మిత్ అండగా నిలిచాడు. వందో టెస్టు ఆడుతున్న వార్నర్ లంచ్ అనంతరం 144 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఇది అతడికి 25వ శతకం కాగా.. ఆ తర్వాత మరింత స్వేచ్ఛగా ఆడాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల విమర్శల పాలవుతున్న వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా కక్ష కట్టినట్లే కనిపించింది. బాల్ ట్యాంపరింగ్ వివాదం అనంతరం తనపై విధించిన కెప్టెన్సీ బ్యాన్‌ను ఎత్తేయాల్సిందిగా వార్నర్ మొర పెట్టుకున్నా.. సీఏ సరైన రీతిలో స్పందించలేదనే చెప్పాలి. ముందు ఆటగాడిగా సత్తాచాటితే ఆ తర్వాత నాయకత్వంపై మాట్లాడొచ్చు అని పేర్కొంది. దీంతో రగిలిపోయిన ఈ ఓపెనర్.. దక్షిణాఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడాడు. డబుల్ సెంచరీ అనంతరం ఆ కసి అతడి కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు మార్క్‌వా (8029)ను దాటేసిన వార్నర్ (8122) ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఏడో స్థానానికి ఎగబాకాడు.
- అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా 45 సెంచరీలు పూర్తి చేసిన వార్నర్.. సచిన్ టెండూల్కర్ (45) సరసన చేరాడు.
- కెరీర్ వందో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా వార్నర్ చరిత్రకెక్కాడు. గతంలో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ ఈ ఘనత సాధించాడు.
- వందో వన్డే, టెస్టులో సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా వార్నర్ నిలిచాడు. గార్డెన్ గ్రినీడ్జ్ ముందు వరుసలో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

