David Warner | టెస్టులకు గుడ్ బై చెప్పనున్న వార్నర్.. సొంతగడ్డపై పాక్‌తో ఆఖరి మ్యాచ్..?
David Warner : ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) త్వరలోనే టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడు. వచ్చే ఏడాది సొంత గడ్డపైనే టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలగాలని వార్నర్ భావిస్తున్నాడు. తనకెంతో ఇష్టమైన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(SCG)లో పాకిస్థాన్‌తో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆఖరి టెస్ట్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని శనివారం
David Warner : ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) త్వరలోనే టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడు. వచ్చే ఏడాది సొంత గడ్డపైనే టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలగాలని వార్నర్ భావిస్తున్నాడు. తనకెంతో ఇష్టమైన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(SCG)లో పాకిస్థాన్‌తో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆఖరి టెస్ట్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని శనివారం అతనే స్వయంగా వెల్లడించాడు.
వరల్డ్ కప్ నా కెరీర్లో ఆఖరి మ్యాచ్ అవుతుందని నేను ప్రతిసారి చెప్తున్నా. ఒకవేళ వరల్డ్ కప్‌లో నేను పరుగులు సాధిస్తే ఆస్ట్రేలియాకు ఆడతానని నా కుటుంబానికి మాట ఇచ్చాను. అయితే.. వెస్టిండీస్ సిరీస్ మాత్రం ఆడడం లేదు. ఒకవేళ పాకిస్థాన్ సిరీస్‌కు ఎంపికైతే అది నా ఆఖరి టెస్టు మ్యాచ్ అవుతుంది అని వార్నర్ తెలిపాడు.
17 టెస్టుల్లో ఒకటే శతకం
గత కొంతకాలంగా టెస్టుల్లో వార్నర్ రికార్డు ఏమంత గొప్పగా లేదు. గత రెండేళ్లలో 17 టెస్టులు ఆడిన అతను ఒకే ఒక సెంచరీ కొట్టాడంతే. అంతేకాదు కెప్టెన్సీ విషయమై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో వార్నర్‌కు విభేదాలు మొదలయ్యాయి. దాంతో, అతను మొత్తంగా ఆటకు వీడ్కోలు పలుకుదామని అనుకున్నాడట. అయితే.. భారత్‌లో ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ తర్వాత అతను నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ 103 టెస్టులు, 142 వన్డేలు, 99 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 16వ సీజన్లో వార్నర్ అదరగొట్టాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు
ఈ ఏడాది ప్రారంభంలో స్వదేశంలో వార్నర్ చెలరేగి ఆడాడు. దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ కొట్టాడు. అయితే.. భారత పర్యటనలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో మాత్రం దారుణంగా విఫలయమ్యాడు. దాంతో, అతడి పనై పోయిందనుకున్నారంతా. కానీ, ఐపీఎల్ 16వ సీజన్లో వార్నర్ దంచికొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా అతను 6 అర్ధ శతకాలు బాదాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఢిల్లీ పాయింట్లపట్టికలో అట్టడుగున నిలిచింది. ఐపీఎల్ ప్రదర్శనతో అనుభవజ్ఞుడైన అతడికి క్రికెట్ ఆస్ట్రేలియా మారో చాన్స్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్ 7-11 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
ఇవి కూడా చదవండి
Novak Djokovic | జకోవిచ్ ఛాతీపై చిప్.. అదొక పెద్ద రహస్యమన్న సెర్బియా స్టార్
భారత్-‘ఎ’ జట్టులో త్రిష
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

