మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల రెండవ సెమీస్‌లో అంపైర్‌పై అరిచిన రష్యా ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్కు టెన్నిస్ ఆస్ట్రేలియా నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. క్రీడాస్పూర్తిని మరిచి వ్యవహరించిన తీరుకు అతనికి ఆ ఫైన్ వేశారు. చైర్ అంపైర్ జైమే క్యాంపిస్తోల్పై మెద్వెదెవ్ చిందులు వేశాడు. ఈ నేపథ్యంలో రష్యా ప్లేయర్‌కు 12 వేల డాలర్లు అంటే సుమారు 9 లక్షల రూపాయల జరిమానా విధించారు. సెమీస్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి సిట్సిపాస్ తండ్రి అతనికి సూచనలు ఇస్తూ కనిపించాడు. అయితే ఆ సమయంలో అంపైర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మెద్వెదెవ్కు కోపం వచ్చింది. ఆగ్రహంతో అంపైర్‌పై ఊగాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా.. ప్రతి పాయింట్ గురించి తండ్రి కోచింగ్ ఇస్తాడా, ఇదే ఆట, నా ప్రశ్నకు బదులివ్వండి అంటూ అంపైర్‌ను మెద్వెదెవ్ నిలదీశాడు.