CWG 2022 | సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్ చేరిన భారత మహిళలు
కామన్వెల్త్ క్రీడల్లో పతకమే లక్ష్యంగా బరిలో దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. టోర్నీ ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసిన భారత జట్టు.. ఆ తర్వాత పట్టుదలగా ఆడుతూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడి విజయం సాధించింది.
ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయాలు నమోదు చేసిన ఇంగ్లండ్‌కు ఓటమి రుచిచూపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళలు.. స్మృతి మంధాన (32 బంతుల్లో 61), జెమీమా రోడ్రిగెజ్ (44 నాటౌట్) రాణించడంతో మంచి స్కోరు చేసింది. షెఫాలీ వర్మ (15) కొంత తడబడినా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20), దీప్తి శర్మ (20) మంచి సహకారం అందించారు.
పూజా వస్త్రాకర్ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెఫాలీ వర్మ మినహా భారత బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో భారీ షాట్లు ఆడటంలో విఫలమైన ఇంగ్లండ్ బ్యాటర్లు టార్గెట్ ఛేదించలేకపోయారు.

సోఫియా డంక్లీ (19), డాన్నీ వ్యాట్ (35) ఆ జట్టుకు శుభారంభమే అందించారు. అయితే భారత ఫీల్డర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అలైస్ కాప్సీ (13), కెప్టెన్ నాట్ స్కివర్ (41), అమీ జోన్స్ (31) వరుసగా రనౌట్లు అయ్యారు. దీంతో ఆ జట్టు విజయావకాశాలు బాగా దెబ్బతిన్నాయి. కేథరీన్ బ్రంట్ (0)ను స్నేహ్ రాణా అవుట్ చేయగా.. మైయా బొషీర్ (4 నాటౌట్), సోఫీ ఎక్సెల్‌టోన్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నా ఏం చెయ్యలేకపోయారు.
దీంతో ఆ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లతో సత్తాచాటగా.. దీప్తి శర్మ ఒక వికెట్ తీసుకుంది. ఈ విజయంతో భారత మహిళలు కామన్ వెల్త్ క్రీడల్లో ఫైనల్ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ జట్ల మధ్య రెండో సెమీస్ జరగనుంది. ఈ మ్యాచ్ విజేతతో స్వర్ణ పతకం కోసం భారత్ తలపడుతుంది.
FINALS, here we come 💥💙💪#TeamIndia #GoForGlory pic.twitter.com/wSYHmlv3rb
— BCCI Women (@BCCIWomen) August 6, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

