SA vs BAN | మహ్మదుల్లా ఒంటరిపోరాటం వృథా.. బంగ్లాపై సఫారీల సవారీ..
SA vs BAN | ముంబైలో వాంఖెడే వేదికగా బంగ్లాదేశ్‌తో ముగిసిన మ్యాచ్‌లో సఫారీలు.. బంగ్లా పులులపై సవారీ చేశారు. మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపిన సౌతాఫ్రికా తర్వాత బౌలింగ్ లో కూడా రెచ్చిపోయింది.
SA vs BAN | వన్డే వరల్డ్ కప్‌లో భారీ విజయాలతో జోరుమీదున్న దక్షిణాఫ్రికా మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసింది. ముంబైలో వాంఖెడే వేదికగా బంగ్లాదేశ్‌తో ముగిసిన మ్యాచ్‌లో సఫారీలు.. బంగ్లా పులులపై సవారీ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోరు చేయగా అనంతరం బౌలింగ్‌లోనూ విజృంభించి బంగ్లాకు గెలుపు ఆలోచన రాకుండా చేశారు. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. 46.4 ఓవర్లలో 233 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సౌతాఫ్రికా 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా తరఫున ఆ జట్టు వెటరన్ ఆటగాడు మహ్మదుల్లా (111 బంతుల్లో 111, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో ఒంటరిపోరాటం చేశాడు. తన సహచర బ్యాటర్లు తలవంచినచోటే మహ్మదుల్లా స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది. కివీస్‌తో పాటు సఫారీ జట్టుకూ 8 పాయింట్లే ఉన్నా సౌతాఫ్రికాకు మెరుగైన రన్ రేట్ కారణంగా రెండో స్థానాన్ని చేరింది. బంగ్లాదేశ్‌కు ఇది ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగో పరాజయం.
భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు దంచికొట్టిన చోట బంగ్లా బ్యాటర్లు బెంబేలెత్తారు. మార్కో జాన్సెన్ వేసిన ఏడో ఓవర్లో బంగ్లాదేశ్.. రెండు కీలక వికెట్లను కోల్పోయింది. తాంజిద్ హసన్ (12)తో పాటు నజ్ముల్ హోసెన్ శాంతో (0)లు వరుసబంతుల్లో నిష్క్రమించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (1), ముష్ఫీకర్ రహీమ్ (8) కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. 44 బంతులాడి మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసిన లిటన్ దాస్ కూడా నిష్క్రమించడంతో బంగ్లాదేశ్.. 21వ ఓవర్లలో 81 పరుగులకే ఆరు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
పరువు నిలిపిన మహ్మదుల్లా..
దక్షిణాఫ్రికా బౌలర్ల జోరు చూస్తే బంగ్లాదేశ్ 120 లోపే చాపచుట్టేస్తుందని అనిపించినా బంగ్లా వెటరన్ ఆటగాడు మహ్మదుల్లా తన అనుభవన్నంతా రంగరించి బంగ్లాదేశ్‌కు భారీ ఓటమిని తప్పించాడు. సహచరులంతా విఫలమై పెవిలియన్ చేరుతున్నా మహ్మదుల్లా మాత్రం పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. ఆరో వికెట్‌కు మెహిది హసన్ మిరాజ్ (11)తో కలిసి 23 పరుగులు జతచేసిన మహ్మదుల్లా.. ఏడో వికెట్‌కు నసుమ్ అహ్మద్ (19)తో కలిసి 39 బంతుల్లో 41 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరూ నిష్క్రమించినా ఎనిమిదో నెంబర్ బ్యాటర్ హసన్ మహ్మద్ (15) తో కలిసి 49 బంతుల్లో 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ జోడీ బంగ్లా స్కోరును 150 మార్క్ దాటించింది. బంగ్లాదేశ్ టాపార్డర్‌ను ఇబ్బందిపెట్టిన జాన్సెన్, రబాడా, కొయెట్జ్లతో పాటు స్పిన్నర్ కేశవ్ మహారాజ్లను మహ్మదుల్లా సమర్థంగా ఎదుర్కున్నాడు.
ఒక్కో పరుగు కూడబెట్టుకుంటూ 67 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన అతడు జాన్సెన్ వేసిన 36వ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. వికెట్లు పడుతున్నా పట్టుదలగా బ్యాటింగ్ చేసిన మహ్మదుల్లా.. రబాడా వేసిన 45వ ఓవర్లో రెంబోబంతిని ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీసి 104 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. వరల్డ్ కప్‌లో మహ్మదుల్లాకు ఇది మూడో శతకం కావడం గమనార్హం. తొమ్మిదో వికెట్‌కు ముస్తాఫిజుర్ రెహ్మాన్ (11) తో కలిసి 55 బంతుల్లో 68 పరుగులు జోడించాడు. టాపార్డర్ వికెట్లను టపటపా పడగొట్టిన సఫారీ బౌలర్లు తోకను మాత్రం కత్తిరించలేక చతికిలపడ్డారు. లోయరార్డర్ అండతో మహ్మదుల్లా బంగ్లాదేశ్ పరువు నిలిపాడు. ఆఖరికి మహ్మదుల్లా.. కొయెట్జ్ వేసిన 45వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి జాన్సెన్ చేతికి చిక్కాడు.
అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (174), హెన్రిచ్ క్లాసెన్ (90), ఎయిడెన్ మార్క్రమ్ (60)లు ధాటిగా ఆడి ఆ జట్టుకు భారీ స్కోరును అందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

