Mitchell Starc: స్టార్క్ జైత్రయాత్రకు బ్రేకులు.. అయినా చరిత్రే
Mitchell Starc: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వన్డే ప్రపంచకప్‌లో అప్రతీహాతంగా కొనసాగిస్తున్న అరుదైన రికార్డుకు బ్రేక్ పడింది.
Mitchell Starc: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వన్డే ప్రపంచకప్‌లో అప్రతీహాతంగా కొనసాగిస్తున్న అరుదైన రికార్డుకు బ్రేక్ పడింది. వరల్డ్ కప్‌లో వరుసగా 23 మ్యాచ్‌లలో కనీసం ఒక వికెట్ తీసిన బౌలర్‌గా ఉన్న స్టార్క్.. తాజాగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. తద్వారా 23 మ్యాచ్‌లలో అప్రతీహాతంగా సాగుతున్న అతడి జైత్రయాత్రకు బ్రేక్ పడినట్టైంది.
2015 నుంచి వన్డే వరల్డ్ కప్ పోటీలలో భాగమవుతున్న స్టార్క్.. ఇంగ్లండ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ టోర్నీలో మొత్తంగా 22 వికెట్లు తీశాడు. ఇక 2019 వన్డ ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో కూడా అతడు 27 వికెట్లు పడగొట్టాడు.
Mitchell Starc has taken atleast 1 wicket in 23 consecutive games in World Cup history.
– A GOAT in World Cup. pic.twitter.com/1BgT6D9NUK
— Johns. (@CricCrazyJohns) October 25, 2023
ఇక భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇండియాతో ఆడిన తొలిమ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన స్టార్క్ తర్వాత సౌతాఫ్రికాతోనూ రెండు వికెట్లు తీశాడు. ఈనెల 25న నెదర్లాండ్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన స్టార్క్.. కివీస్‌తో మ్యాచ్‌లో మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన స్టార్క్.. 89 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ చివరి ఓవర్లో కివీస్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా స్టార్క్ 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్‌కు అపూర్వ విజయాన్ని అందించాడు. స్టార్క్ జైత్రయాత్రకు బ్రేకులు పడ్డా వరల్డ్ కప్‌లో వరుసగా 23 మ్యాచ్‌ల పాటు కనీసం ఒక్క వికెట్ అయినా తీసిన బౌలర్ మరొకరు లేరు. గతంలో ఈ రికార్డు ఆసీస్‌కే చెంది దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ (13 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

