సఫారీ సవారీ
దంచుడే పరమావధిగా సాగుతున్న దక్షిణాఫ్రికా.. వన్డే ప్రపంచకప్‌లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 149 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేశారు.
- దంచికొట్టిన డికాక్
- దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికా
- బంగ్లాదేశ్ నాలుగో ఓటమి
నెదర్లాండ్స్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత గాయపడ్డ సింహంలా గర్జిస్తున్నది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన సఫారీలు.. తాజాగా బంగ్లాదేశ్‌ను బెంబేలెత్తించారు. డికాక్ భారీ సెంచరీతో విరుచుకుపడితే.. బంగ్లా బౌలర్లకు క్లాసెన్ పగటి పూటే చుక్కలు చూపాడు.
ముంబై: దంచుడే పరమావధిగా సాగుతున్న దక్షిణాఫ్రికా.. వన్డే ప్రపంచకప్‌లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 149 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేశారు. డికాక్ (140 బంతుల్లో 174; 15 ఫోర్లు, 7 సిక్సర్లు) రికార్డు సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్ (49 బంతుల్లో 90; 2 ఫోర్లు, 8 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (15 బంతుల్లో 34 నాటౌట్; ఒక ఫోర్, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు.
కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్ (60) అర్ధశతకం సాధించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ ప్లేయర్ మహ్ముదుల్లా (111; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ షకీబ్ (1), నజ్ముల్ (0), ముష్ఫికర్ (8), లిటన్ దాస్ (22), తన్జీద్ (12), మెహదీ (11) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ 3, జాన్సెన్, లిజాడ్, రబడ తలా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. తాజా ప్రపంచకప్‌లో మూడో సెంచరీ నమోదు చేసుకున్న డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 382/5 (డికాక్ 174, క్లాసెన్ 90; మహమూద్ 2/67),
బంగ్లాదేశ్: 46.4 ఓవర్లలో 233 ఆలౌట్ (మహ్ముదుల్లా 111; గెరాల్డ్ 3/62, జాన్సన్ 2/39).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

