బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టుకు ఓ మోస్తరు ఆరంభమే లభించింది. టచ్‌లో కనిపించిన రుతురాజ్ గైక్వాడ్ (17) అవుటవడంతో చెన్నై జట్టు పెద్దగా స్కోరు చేసేలా కనిపించలేదు. అయితే రాబిన్ ఊతప్ప (14 నాటౌట్) నెమ్మదిగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు.
అతనికి మొయీన్ అలీ (3) నుంచి సహకారం అందినట్లే కనిపించింది. కానీ ఏడో ఓవర్ నాలుగో బంతికి అతన్ని తొలి మ్యాచ్ ఆడుతున్న ఆటగాడు సూయశ్ ప్రభుదేశాయి రనౌట్ చేశాడు. ఈ క్రమంలోనే పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై జట్టు ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే అలీ వికెట్ కోల్పోయింది. రుతురాజ్‌ను ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న హాజిల్‌వుడ్ అవుట్ చేశాడు.