చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ (19) అవుటయ్యాడు. తీక్షణ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి అతను పెవిలియన్ చేరాడు. తీక్షణ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేయడానికి వార్నర్ ప్రయత్నించాడు.
అయితే మిస్ అవడంతో బంతి అతని తొడను తాకింది. అంపైర్ అవుటివ్వడంతో వార్నర్ రివ్యూ కోరాడు. రిప్లే చూసిన తర్వాత కూడా అంపైర్ నిర్ణయం మారలేదు. దాంతో వార్నర్ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు.