ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో అదరగొట్టిన ఓపెనర్ డెవాన్ కాన్వే (87) అవుటయ్యాడు. అతన్ని అవుట్ చేయడానికి ఢిల్లీ సారధి పంత్ ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. ముఖ్యంగా ఢిల్లీ స్పిన్నర్లను అతను ఉతికి ఆరేశాడు. ఈ క్రమంలో 17వ ఓవర్లో బంతి అందుకున్న ఖలీల్ అహ్మద్.. మరోసారి సత్తా చాటాడు.
కీలకమైన సమయంలో కాన్వేను పెవిలియన్ చేర్చాడు. అహ్మద్ వేసిన బంతిని ఆడే క్రమంల్ ఎడ్జ్ తీసుకున్న బంతిని.. పంత్ డైవ్ చేసి మరీ పట్టేయడంతో కాన్వే మైదానం వీడాడు.