ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైకి హస్సీ, బాలాజీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడుతుండడంతో ఈ లీగ్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఐతే కరోనా సోకిన ఆటగాళ్లు, సిబ్బంది మాత్రం ఇంకా భారత్‌లో ఉన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే తమ ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బ్యాటింగ్ కన్సల్టెంట్ మైకేల్ హస్సీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నై టీమ్ ఢిల్లీలో ఉంది. బాలాజీ, హస్సీని ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైకి తీసుకెళ్లాలని చెన్నై యాజమాన్యం
నిర్ణయించింది. వీరిద్దరూ వైరస్ బారినపడటంతో కనీసం రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోనున్నారు. లీగ్ వాయిదా పడటంతో చాలా మంది ఆటగాళ్లను ఇప్పటికే ఫ్రాంఛైజీలు తమ ఇళ్లకు పంపించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Air Ambulance
- Balaji
- CSK
- Hussey
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తున్న గ్రీన్ SM కంపెనీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ACB raids | ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఇంటిపై ఏసీబీ దాడులు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
PM Modi | ప్రెస్ రిలీజ్‌ల కాలం పోయింది.. ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్..!
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

