GT vs CSK : చివరి లీగ్ మ్యాచ్‌పై చెన్నై సూపర్ కింగ్స్(CSK) భవితవ్యం ఆధారపడి ఉంది. గురువారం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడితే చెన్నై ఇంటికి వెళ్లడం ఖాయం. గెలిచిందంటే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. చావోరేవో మ్యాచ్‌లో సీఎస్కే విజయంపై కన్నేయగా.. ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన గుజరాత్ రెండు పాయింట్లతో టాప్-2గా లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. టాస్ గెలిచిన రతురాజ్ గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి మ్యాచ్‌కు వేళైంది. ఇదివరకూ 8 వికెట్ల తేడాతో చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనకుంటోంది. గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే పరిస్థితి కాబట్టి ఎలాగైనా గుజరాత్‌ను ఓడించాలని సీఎస్కే వ్యూహాలు పన్నుతోంది. ఇరుజట్లు తుది పదకొండు మందిలో చెరొక మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.
Location: Ahmedabad 📍
Occasion: A Mega Clash 🤩Another contest of immense importance on the 𝗿𝗼𝗮𝗱 𝘁𝗼 𝗽𝗹𝗮𝘆𝗼𝗳𝗳𝘀 👊#TATAIPL | #KhelBindaas | #GTvCSK pic.twitter.com/Cc7flN4OEg
— IndianPremierLeague (@IPL) May 21, 2026
చెన్నై తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, బ్రెవిస్, దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, జాన్సన్, ముకేశ్ చౌదరీ, గుర్న్ప్రీత్ సింగ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – ప్రసిధ్, అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్, ఖెజ్రోలియా, కుశగ్ర.
గుజరాత్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, సుందర్, హోల్డర్, రషీద్ ఖాన్, తెవాటియా, రబడ, అర్షద్ ఖాన్, సిరాజ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – కార్తిక్ శర్మ, నొరోన్హ, సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అమన్ ఖాన్.