రొనాల్డో మరో వరల్డ్ రికార్డ్

బుడాపెస్ట్: యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మాంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే యూరోకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఈ స్టార్ ప్లేయర్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ వరల్డ్ రికార్డును సమం చేశాడు. బుధవారం ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అతడు.. ఇన్నాళ్లూ ఇరాన్‌కు చెందిన అలీ డేయీ పేరిట ఉన్న రికార్డును సమం చేయగలిగాడు. ప్రస్తుతం రొనాల్డో 109 గోల్స్‌తో అలీతో కలిసి టాప్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో పోర్చుగల్ నాకౌట్లోకి ప్రవేశించింది.
ఇదే టోర్నీలో పోర్చుగల్ కనీసం మరో మ్యాచ్ ఆడుతుండటంతో రొనాల్డో కొత్త వరల్డ్ రికార్డు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే యూరో 2020లో అతడు టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. మూడు మ్యాచ్‌లలో ఐదు గోల్స్ చేశాడు. అంతేకాదు ఓవరాల్‌గా యూరోలో అత్యధిక గోల్స్ రికార్డు కూడా అతని పేరిటే ఉంది. మొత్తం 14 గోల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

