ICC Men’s T20 World Cup | బేస్‌బాల్ అడ్డాలో క్రికెట్ ఫీవర్.. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ దక్కేనా..?
ICC Men's T20 World Cup | భారత్‌లో క్రికెట్ అంటే ఓ మతం. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నెలకొల్పిన బ్రిటన్ ఏలిన కామన్వెల్త్ దేశాల్లోని క్రికెట్ ఆడే దేశాల్లో ఈ ఆటకు మంచి ఆదరణే ఉంది. ఇక్కడ ఏ టోర్నీలు జరిగినా ఫుల్ క్రేజ్ ఉంటుంది. కానీ మరో నాలుగు రోజుల్లో మొదలుకాబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024కు ఓ ప్రత్యేకత ఉంది.
నమస్తే తెలంగాణ క్రీడా : భారత్‌లో క్రికెట్ అంటే ఓ మతం. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నెలకొల్పిన బ్రిటన్ ఏలిన కామన్వెల్త్ దేశాల్లోని క్రికెట్ ఆడే దేశాల్లో ఈ ఆటకు మంచి ఆదరణే ఉంది. ఇక్కడ ఏ టోర్నీలు జరిగినా ఫుల్ క్రేజ్ ఉంటుంది. కానీ మరో నాలుగు రోజుల్లో మొదలుకాబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024కు ఓ ప్రత్యేకత ఉంది. క్రికెట్ అంటే అమితాభిమానం ఉన్న వెస్టిండీస్‌తో పాటు ఈ ఆటతో సంబంధమే లేని అమెరికా సంయుక్త రాష్ర్టాల (యూఎస్ఎ) వేదికగా 9వ పొట్టి ప్రపంచకప్ పోరు జరుగనుంది. బేస్‌బాల్, బాస్కెట్‌బాల్ అంటే పడి చచ్చే అమెరికన్లు… క్రికెట్‌ను ఏ మేరకు ఆదరించగలరు?
ప్రపంచాన్ని కనుసైగతో శాసిస్తున్న అమెరికాలో టీ20 వరల్డ్ కప్‌నకు జూన్ 2న తెరలేవనుంది. ఇప్పుడిప్పుడే యూఎస్ఎలో క్రికెట్ వ్యాప్తికి విశ్వప్రయత్నాలు చేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. మెగా టోర్నీతో అగ్రరాజ్యంలో ఈ ఆటను మరింత ముందుకు తీసుకెళ్లే వ్యూహంతో సిద్ధమౌతోంది. అదీగాక 128 ఏండ్ల తర్వాత లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్ (2028)లో ఈ ఆటను తిరిగి విశ్వక్రీడల్లో ప్రవేశపెట్టేందుకూ పొట్టి పోరును విజయవంతంగా నిర్వహించడం ఐసీసీకి అత్యావశ్యకం. కానీ బేస్‌బాల్, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్), నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) వంటి టోర్నీలు ఉంటే ప్రపంచంతో తమకేమీ పట్టనట్టు వ్యవహరించే యూఎస్ఎలో క్రికెట్‌ను ఎలా ఆదరిస్తారనేదే అసలు ప్రశ్న. గుండ్రటి బ్యాట్‌తో బేస్‌బాల్‌ను చూసిన అమెరికన్లు.. ఫ్లాట్ బ్యాట్‌తో ఆడే క్రికెట్‌ను అదే ఉత్సాహంతో చూడగలుగుతారా? ఈ ఆటలో ‘పిచర్’, ‘సెకండ్ బేస్’, ‘షార్ట్ స్టాప్’ వంటి ఫీల్డ్ పొజిషన్లను ఏండ్లుగా చూస్తున్న వారికి క్రికెట్లోని ‘షార్ట్ థర్డ్ మెన్’, ‘ఫైన్ లెగ్’, ‘డీప్ మిడ్ వికెట్’ అంటే అర్థమవుతుందా..?

అమెరికాలో క్రికెట్‌ను సుమారు 3 కోట్ల మంది అభిమానులు వీక్షిస్తున్నారని, తాజా టోర్నీతో ఆ సంఖ్య రెట్టింపు అవుతుందని ఐసీసీ ఆశలు పెట్టుకుంది. ప్రపంచకప్ కంటే ముందే గతేడాది ఇక్కడే నిర్వహించిన మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) టోర్నీ విజయవంతమవడం ఐసీసీ పట్టుదలను మరింత పెంచింది. టీ20 వరల్డ్‌కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్‌ను నియమించడం, అమెరికాలో హుటాహుటిన స్టేడియాల నిర్మాణం, క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడం వంటి పనులతో ఐసీసీ చేయగలిగినంత చేస్తోంది.
వాస్తవానికి అమెరికాలో అభిమానులకు క్రికెట్ కొత్త అయినా ఆ దేశానికి మాత్రం కాదు. 18వ దశకం (బ్రిటన్ పాలనలో)లోనే అమెరికా క్రికెట్ ఆడింది. ఆ దేశ మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ క్రికెట్‌కు వీరాభిమాని. 1844లోనే అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ (కెనడా వర్సెస్ సెయింట్ జార్జి క్రికెట్ క్లబ్) జరిగింది. అయితే బ్రిటన్, ఆస్ట్రేలియాలో క్రికెట్ వ్యాప్తితో ఆ దేశాలు ఆ ఆటమీద గుత్తాధిపత్యాన్ని సాధించిన నేపథ్యంలో అమెరికా ఈ ఆట నుంచి పక్కకు తప్పుకుని 1860 దశకం తర్వత బేస్‌బాల్ వైపునకు మళ్లింది. అమెరికాలో క్రికెట్ వ్యాప్తి చేయడానికి టీ20 ప్రపంచకప్ ఏ మేరకు ఉపయోగపడ్డా కిందిస్థాయి నుంచి ప్రోత్సహించాలని విశ్లేషకుల వాదన. మరి ఐసీసీ ఉత్సాహం ఆదిలోనే ఆవిరికావొద్దన్నా, లాస్ ఏంజెల్స్ కలలు చెదిరిపోవొద్దన్నా టీ20 ప్రపంచకప్ సూపర్ సక్సెస్ అవడం ఐసీసీకి అత్యంత కీలకం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

