మెల్బోర్న్: సుదీర్ఘ ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆస్ట్రేలియా ఆటగాడికి ప్రతి ఏటా అందించే ‘టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు పేరును ఇకపై ‘షేన్ వార్న్ అవార్డు’గా మారుస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆరంభంలో స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మృతిచెందగా.. అతడి జ్ఞాపకార్థం ఈ చర్య చేపట్టినట్లు సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ తెలిపాడు. ‘ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడైన.. షేన్‌వార్న్‌కు గుర్తుగా టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందిస్తాం. అతడు టెస్టు క్రికెట్‌కు చేసిన సేవలు మరువలేనివి. ఇది అందుకు నిదర్శనమని’ హాక్లీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా ఈ వివరాలు వెల్లడించాడు.