Commonwealth Games | బర్మింగ్‌హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గ్రేమ్స్‌లో భారతీయ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించగా.. తాజాగా పురుషుల 96 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత ఆటగాడు వికాస్ ఠాకూర్ సిల్వర్ మెడల్‌ను సాధించాడు. వికాస్ ఏకంగా 346 కేజీల (స్నాచ్‌లో 155 కేజీలు అండ్ క్లీన్ అండ్ జెర్క్‌లో 199 కేజీలు) బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. వికాస్‌కు ఇది మూడో కామన్వెల్త్ గేమ్స్ పతకం.
ఇంతకు ముందు గ్యాస్గో (2014), గోల్డ్ కోస్ట్ (2018) క్యాంసం సాధించాడు. బర్మింగ్‌హోమ్‌లో జరుగుతున్న క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు ఇప్పటి వరకు ఎనిమిది పతకాలు సాధించారు. ఇందులో మీరాబాయి చాను, జెరెమీ లాల్రినుంగా, అచింత షెయులీ, సంకేత్ సర్గర్, బింద్యారాణి రాణి, గురురాజా పూజారి, హర్జిందర్ కౌర్, వికాస్ పతకాలను కైవసం చేసుకున్నారు.