VVPL 2024 | గేల్ 10 సిక్సర్లతో విరుచుకుపడినా.. తెలంగాణకు తప్పని ఓటమి
VVPL 2024 : వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) మరోసారి సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. విధ్వంసక ఓపెనర్ అయిన గేల్ ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(VVPL 2024)లో తన ప్రతాపం చూపించాడు. తెలంగాణ టైగర్స్(Telangana Tigers) జట్టుకు ప్రాతినిధ్యం...
VVPL 2024 : వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) మరోసారి సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. విధ్వంసక ఓపెనర్ అయిన గేల్ ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(VVPL 2024)లో తన ప్రతాపం చూపించాడు. తెలంగాణ టైగర్స్(Telangana Tigers) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ సోమవారం వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌరల్లకు చుక్కలు చూపించాడు. 270 పరుగుల ఛేదనలో ఈ డాషింగ్ బ్యాటర్ ఏకంగా 10 సిక్సర్లు బాదాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తూ 46 బంతుల్లోనే 94 రన్స్ చేశాడు. ఆరో వికెట్‌కు కంది శశికాంత్ రెడ్డితో కలిసి గేల్ 93 పరుగులు జోడించాడు. అయితే.. సెంచరీకి ఆరు పరుగుల దూరంలో వికెట్ పారేసుకున్నాడు. అతడు ఔటయ్యే సరికి తెలంగాణ టైగర్స్ స్కోర్.. 198-7.
A Gayle-storm of sixes! 10 big ones 🔥
.
.#IVPL @ivplt20 @henrygayle pic.twitter.com/WwTHG7kcdF— FanCode (@FanCode) February 26, 2024
ఆ తర్వాత వచ్చిన వాళ్లు చేతులెత్తేయడంతో తెలంగాణ జట్టు 45 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీకి పవన్ నేగీ సెంచరీతో భారీ స్కోర్ అందించాడు. అతడు 56 బంతుల్లోనే 139 రన్స్ చేశాడు. దాంతో, యూపీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు బాదింది.
ఇవి కూడా చదవండి
- mohammed shami | షమీకి శస్త్రచికిత్స విజయవంతం.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ క్రికెటర్
- Jan Vishwas Yatra | తేజస్వి జన్ విశ్వాస్ యాత్రలో అపశ్రుతి.. ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

